వామ్మో.. ఎంతపెద్ద స్టోన్ : మూత్రనాళంలో భారీ రాయి తొలగింపు
దేశంలో చాలామందిలో కిడ్నీలో రాళ్లు పెరగడం సర్వసాధారణం. మూత్రనాళంలో పెరిగిన చిన్న చిన్న రాళ్లను వైద్యులు తొలగించవచ్చునని తెలుసు. కానీ, మూత్రనాళంలో పెద్ద పరిమాణంలో రాయి ఉండటం ఎప్పుడైనా చూశారా?

దేశంలో చాలామందిలో కిడ్నీలో రాళ్లు పెరగడం సర్వసాధారణం. మూత్రనాళంలో పెరిగిన చిన్న చిన్న రాళ్లను వైద్యులు తొలగించవచ్చునని తెలుసు. కానీ, మూత్రనాళంలో పెద్ద పరిమాణంలో రాయి ఉండటం ఎప్పుడైనా చూశారా?
దేశంలో చాలామందిలో కిడ్నీలో రాళ్లు పెరగడం సర్వసాధారణం. మూత్రనాళంలో పెరిగిన చిన్న చిన్న రాళ్లను సర్జరీ ద్వారా తొలగించుకుంటారు. కానీ, మూత్రనాళంలో పెద్ద పరిమాణంలో రాయి ఉండటం ఎప్పుడైనా చూశారా? ఓ వ్యక్తికి ఢిల్లీలో సర్జరీ చేసిన వైద్యులు.. అతడి మూత్రనాళం నుంచి 22 సెంటీమీటర్ల భారీ పరిమాణంలో ఉన్న స్టోన్ ని తొలగించారు. దీని బరువు ఎంతో తెలుసా? మొత్తం 60 గ్రాముల వరకు ఉందని వైద్యులు తెలిపారు. మార్చి 23న ఢిల్లీలోని శ్రీగంగా రామ్ ఆస్పత్రిలో రోబోట్ సర్జరీ చేసిన వైద్యులు ఈ భారీ స్టోన్ ను మూత్ర నాళం నుంచి తొలగించారు.
Read Also : ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్
ఇది.. ప్రపంచంలోనే అతిపెద్ద మూత్రనాళ స్టోన్ గా వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రి వైద్యులు, కన్సల్టెంట్ సచిన్ ఖాతురియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూత్రనాళంలో అతిపెద్ద స్టోన్ ఉండటం చూసి ఆశ్చర్యపోయాం. ఈ స్టోన్.. మూత్రనాళం పైపు మొత్తంపై భాగం వరకు వ్యాపించి ఉంది. రోబోట్ సర్జరీ ద్వారా సులభంగా స్టోన్ నుంచి తొలగించాం. లేదంటే.. పేషెంట్ ఎన్నో సర్జీలు చేయించుకోవాల్సి వచ్చేది’ అని అన్నారు. తొలగించిన స్టోన్ 21.5 సెంటీమీటర్ల పొడవు ఉందని వైద్యులు ఖాతురియా తెలిపారు.
సర్జరీ చేయించుకున్న పేషెంట్.. షహరాన్ పూర్ కు చెందిన నటషా గా వైద్యులు చెప్పారు. మార్చి 22న నటషా ఆస్పత్రిలో చేరిందని, మార్చి 23న నాలుగు గంటల పాటు శ్రమించి ఆమె మూత్రనాళం నుంచి స్టోన్ తొలగించినట్టు చెప్పారు. కొన్ని ఏళ్లుగా తన కడుపులో భారీ స్టోన్ పెరుగుతున్నప్పటికీ నటషాకు ఎలాంటి నొప్పి తెలియకపోవడం నిజంగా ఎంతో అదృష్టమన్నారు.
రోబో సర్జరీ ద్వారా మూత్రనాళం నుంచి స్టోన్ తొలగించడం.. కొంచెం భయంగా అనిపించినా.. పేషెంట్ త్వరగా కోలుకుంటారని వైద్యులు చెప్పారు. కిడ్నీలో పెద్ద రాళ్లు పెరగడం అసాధారణం కానప్పటికీ.. ఈ రాళ్లను తొలగించాలంటే ఒకేసారి సాధ్యం కాదు.. పూర్తిగా తొలగించాలంటే ఎక్కువ సార్లు సర్జరీ చేయాల్సి ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీతో వైద్యులు సచిన్ ఖాతురియా, అజయ్ శర్మ, విక్రమ్ బత్రా, రోబో వైద్యబృందం కలిసి మూత్రనాళ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.
Read Also : లక్ష్మీపార్వతి జోస్యం : వైసీపీకి 125 ఎమ్మెల్యే , 22 ఎంపీ సీట్లు ఖాయం