Belly Fat: బెల్లీ ఫ్యాట్ చాలా డేంజర్.. తొలగించాలంటే ఈ 5 పనులు చేయకతప్పదు

Belly Fat: మానవ ఆరోగ్యం విషయంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించాలంటే ముందు మన ఆహారాన్ని నయమావాలని మార్చుకోవాలి.

Belly Fat: బెల్లీ ఫ్యాట్ చాలా డేంజర్.. తొలగించాలంటే ఈ 5 పనులు చేయకతప్పదు

You must do these 5 things to reduce belly fat

Updated On : August 11, 2025 / 5:39 PM IST

ఈ రోజుల్లో చాలా మంది పురుషులు, మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటి బెల్లీ ఫ్యాట్. పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు. ఇది చాలా చిన్న సమస్యగా కనిపించినా.. ఆరోగ్యంపైన మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది హార్ట్ డిసీజ్, టైప్ 2 డయాబెటిస్, బీపీ ఇతర మెటబాలిక్ రుగ్మతలకు దారితీస్తుంది. అందుకే, ఈ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడం చాలా అవసరం. దీనిని తగ్గించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆహారం మానేయడం, డైట్ చేయడం వంటివి చేస్తుంటారు. కానీ, బెల్లీ ఫ్యాట్ ను దీనిని తగ్గించుకోవడం కోసం కేవలం ఆహారంలో మార్పులు కాదు, జీవనశైలిలో సరైన మార్పులు చేయాల్సి ఉంటుంది. మరి ఆ మార్పులు ఏంటి అనేది అనే విషయం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1.సమతుల్య ఆహారం తీసుకోవడం:
మానవ ఆరోగ్యం విషయంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించాలంటే ముందు మన ఆహారాన్ని నయమావాలని మార్చుకోవాలి. ముందుగా ప్రాసెస్డ్ ఫుడ్, సుగర్ (చక్కెర), కూల్ డ్రింక్స్, మిఠాయిలు, టీ/కాఫీలు తగ్గించాలి. వాటి స్థానంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, పప్పులు, చికెన్, ఫిష్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం, ఓట్స్, గోధుమలు, ఆకుకూరలు, పండ్లు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

2.వ్యాయామం తప్పనిసరి:
బెల్లీ ఫ్యాట్ తక్కువ చేయాలంటే శరీరంలోని కాలరీలు ఖర్చు చేయడం తప్పనిసరి. దానికోసం వ్యాయామం చాలా అవసరం. ప్రతీరోజు ఉదయం 30 నుంచి 45 నిమిషాల నడక తప్పకుండా చేయాలి. అలాగే యోగా, అబ్డోమినల్ ఎక్సర్సైజులు ప్లాంక్స్, లెగ్ రైజ్, క్రంచెస్ వంటివి చేయాలి.

3.ఒత్తిడి తగ్గించుకోవాలి:
అధిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది పొట్ట చుట్టూ కొవ్వును పెంచుతుంది. ఒత్తిడి తగ్గించుకోవడం కోసం ప్రతీరోజు కనీసం 10 నుంచి 15 ధ్యానం, ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఫోన్లు, సోషల్ మీడియా దూరంగా ఉండండి. అలా చేయడం వల్ల నిద్రకు ఆటంకం ఏర్పడకుండా ఉంటుంది.

4.సరైన నిద్ర అవసరం:
నిద్ర అనేది శరీరంలోని కొవ్వు నియంత్రణకు సహాయపడుతుంది. తక్కువ నిద్ర వలన ఆకలి పెరిగే హార్మోన్లు (గ్రెలిన్) పెరుగుతాయి, తృప్తి హార్మోన్లు (లెప్టిన్) తగ్గుతాయి. కాబట్టి, రోజుకు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్ర అవసరం. అలాగే, రాత్రి 8 నుంచి 10 మధ్యలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.

5.తగినంత నీరు తాగాలి:
నీరు శరీరాన్ని శుభ్రపరచడంలో, జీర్ణవ్యవస్థ మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. తగినంత నీరు తాగకపోతే శరీరంలో టాక్సిన్లు పేరుకుని బెల్లీ బల్జ్‌గా మారవచ్చు. కాబట్టి, రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీటిలో లెమన్ తేనె కలిపి తాగితే శారీరం డిటాక్స్ అవుతుంది.

బెల్లీ ఫ్యాట్ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది ఒక్కరోజులో రాదు. కానీ, పైన చెప్పిన 5 పనులను నిష్ఠగా, నిరంతరంగా పాటిస్తే పొట్ట సన్నగా, శరీరం సన్నగా మారుతుంది.