మారనున్న పదవ తరగతి పరీక్ష తేదీ

  • Published By: vamsi ,Published On : February 28, 2019 / 02:11 AM IST
మారనున్న పదవ తరగతి పరీక్ష తేదీ

Updated On : February 28, 2019 / 2:11 AM IST

తెలంగాణా రాష్ట్రంలో మార్చి 22వ తేదీన జరగాల్సిన పదవ తరగతి ఎగ్జామ్ వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో ముందుగా ఇచ్చిన టైమ్ టేబుల్ ప్రకారం ఆరోజు జరగాల్సిన ఇంగ్లీష్ పేపర్-2 ఎగ్జామ్ తేదీ మారే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఆరోజు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉండటంతో.. పీఆర్‌టీయూ తెలంగాణ నాయకులు అంజిరెడ్డి, చెన్నయ్య ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు విజయ్‌కుమార్‌ను కలిసి పరీక్ష తేదీని మార్చాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల తేదీ మారే అవకాశం లేనందున, పరీక్ష తేదీనే మార్చవలసి ఉందని అంటున్నారు. దీనిపై అధికారులు త్వరలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.