హైదరాబాద్‌లో 144 సెక్షన్

  • Published By: vamsi ,Published On : December 5, 2019 / 04:18 AM IST
హైదరాబాద్‌లో 144 సెక్షన్

Updated On : December 5, 2019 / 4:18 AM IST

రేపు(6 డిసెంబర్ 1992).. భారత సామాజిక, రాజకీయ ముఖ చిత్రం మార్చిన రోజు.. అయోధ్యలోని బాబ్రీ కూల్చివేత జరిగిన రోజు. మతపరంగా చూసినా 1992 బాబ్రీ ఘటన తర్వాత, దేశంలో మతం పేరుతో హింస జరిగింది. బాబ్రీ కూల్చివేత తర్వాత జరిగిన మత ఘర్షణల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రతి ఏటా డిసెంబర్‌ 6వ తేదీ వస్తోందంటే, ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉంది. సామాజికంగా చీలిక తెచ్చిన ఈ ఘటన రాజకీయంగానూ కొత్త శక్తులు ఊపందుకోవటానికి తావిచ్చింది. అయితే ఇటీవల అయోధ్య కేసులో సంచలనాత్మక తీర్పు వెలువడిన తరుణంలో..  బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజు (1992 డిసెంబరు 6) దగ్గరపడడంతో దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్‌లో కూడా కొన్ని గ్రూపులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం అందడంతో పాత నేరస్తులపై నిఘా పెంచారు హైదరాబాద్ పోలీసులు. సిటీ అంతా భద్రత కట్టుదిట్టం చేశారు.

రెండ్రోజుల పాటు 144 సెక్షన్ విధించాలని సిటీ పోలీసులు నిర్ణయించారు. హైదరాబాద్‌లో డిసెంబరు 5వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు.

డిసెంబరు 6న మత విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించే ఉందని, లా అండ్ ఆర్డర్ కాపాడడం కోసం రెండ్రోజుల పాటు హైదరాబాద్ సిటీ పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు అంజనీకుమార్ తెలిపారు.