ఒక్క బైక్ పై 75 చలానాలు

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. బైక్ పై ఇప్పటివరకు 75 పెండింగ్ చలానాలు ఉన్నట్లు తేలింది.

  • Published By: veegamteam ,Published On : November 3, 2019 / 02:36 AM IST
ఒక్క బైక్ పై 75 చలానాలు

Updated On : November 3, 2019 / 2:36 AM IST

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. బైక్ పై ఇప్పటివరకు 75 పెండింగ్ చలానాలు ఉన్నట్లు తేలింది.

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు శనివారం (నవంబర్ 2, 2019) శ్రీనగర్‌కాలనీ ప్రధాన రహదారిపై తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో నివాసం ఉంటున్న షేక్ సయీద్.. (ఏపీ 13 ఏఏ 9373) నెంబర్ గల బైక్ పై వెళ్తున్నారు. పోలీసులు అతడి బైక్ ను తనిఖీ చేశారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

ఆ బైక్ పై ఇప్పటివరకు 75 పెండింగ్ చలానాలు ఉన్నట్లు తేలింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లకు గాను రూ.13వేల 125 పెండింగ్‌లో ఉండడంతో పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు ఎవరూ అతీతులు కారనీ, చలాన్ల డబ్బు చెల్లించి బైక్ తీసుకెళ్లమని పోలీసులు అతనికి సూచించారు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు.