ఆదర్శంగా నిండు గర్భిణి : ఓటు కోసం డెలివరీ పోస్ట్ పోన్
ఓటు మన హక్కు. దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పదే పదే చెప్పింది.

ఓటు మన హక్కు. దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పదే పదే చెప్పింది.
ఓటు మన హక్కు. దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పదే పదే చెప్పింది. ఓటు హక్కు వినియోగంపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అయినా కుంటి సాకులు, సిల్లీ కారణాలు చెప్పి ఓటు వెయ్యకుండా తప్పించుకునే వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఓ గర్భిణి ఆదర్శంగా నిలిచింది. 9 నెలల గర్బిణి అంటే.. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నగా నడవాలి. ఎక్కువసేపు నిల్చోలేరు. అలాంటి పరిస్థితుల్లోనూ ఆమె తన ఓటు హక్కు వినియోగించుకుంది. ఆసుపత్రిలో చేరాల్సి ఉన్నా.. పోస్ట్ పోన్ చేసుకుని మరీ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి అందరికి ఆదర్శంగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రం చెవేళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. ఆమె పేరు మల్లేశ్వరి. గురువారం(ఏప్రిల్ 11, 2019) ఉదయం 8.30కి విద్యానికేతన్ మోడల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి మల్లేశ్వరి తన ఓటు వేసింది. నిలబడటానికి ఇబ్బందిగా ఉన్నా… 25 నిమిషాల పాటు క్యూలో ఓపిగ్గా నిల్చోని మరీ ఓటు వేసింది. మల్లేశ్వరి బుధవారమే(ఏప్రిల్ 10) ఆసుపత్రిలో చేరాల్సి ఉందని కుటుంబసభ్యులు చెప్పారు.
Read Also : రెడీ టు అప్లయ్ : SBIలో 8వేల 904 క్లర్క్ పోస్టులు
కానీ మల్లేశ్వరి మాత్రం ఒప్పుకోలేదు. ఓటు వేశాకే ఆసుపత్రికి వెళతానని కుటుంబసభ్యులతో తేల్చి చెప్పిది. దీంతో వారు కాదనలేకపోయారు. మల్లేశ్వరిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు. ఓటు వేశాక మల్లేశ్వరి నేరుగా పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యింది. నిండు గర్బిణి అయినా.. ఎంతో ఓపిగ్గా క్యూలో నిల్చోని ఓటు వేసిన మల్లేశ్వరిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఏప్రిల్ 11న తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎప్పటిలాగే హైదరాబాద్ వాసులు నిర్ల్యక్షంగా వ్యవహరించారు. ఈసారి కూడా ఓటు వేసేందుకు బద్దకించారు. నగరవాసులు ఓటు హక్కు వినియోగించుకోలేదు. నగరంలో తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. సెలవుగా ప్రకటించినా నగరవాసులు ఇళ్లకే పరిమితం అయ్యారు తప్ప ఓటు మాత్రం వెయ్యలేదు. నగరవాసులకు ఈ గర్భిణి సిగ్గుతో తలదించుకునేలా చేసింది.
Read Also : పెళ్లికి ముందు సెక్స్ రేప్ చేసినట్లే : సుప్రీంకోర్టు సంచలన తీర్పు