తెలంగాణకి కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం: ఎంపీ కవిత

తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని అన్నారు మానుకోట ఎంపీ మాలోతు కవిత. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీని కేటీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు.
రాజ్యసభ సభ్యుడు సంతోష్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె మహబూబాబాద్‌లో మొక్కలు నాటి మాట్లాడారు. అనంతరం తన పార్లమెంట్ పరిధిలోని నర్సంపేట, డోర్నకల్, పినపాక ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రెడ్యానాయక్, రేగ కాంతారావులకు ఆమె గ్రీన్ చాలెంజ్ విసిరారు.
ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయానికి మనమందరం సహకారం అందించాలన్నారు. అలాగే తన జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకుని కవిత పేదలకు దుప్పట్లు, బడి పిల్లలకు నోట్‌బుక్స్‌ను పంపిణీ చేశారు.