ఓటు వేసిన చైతూ, బాలయ్య ఫ్యామిలీలు

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 07:41 AM IST
ఓటు వేసిన చైతూ, బాలయ్య ఫ్యామిలీలు

Updated On : April 11, 2019 / 7:41 AM IST

హైదరాబాద్ : టాలీవుడ్ హీరో నాగచైతన్య, భార్య సమంతా హైదరాబాద్ లో తమ ఓటు హక్కుని వినయోగించుకున్నారు. గచ్చిబౌలిలోని నానక్ రామ్ గూడ లోని పోలింగ్ కేంద్రంలో అక్కినేని నాగ చైతన్య దంపతులు ఓటు వేశారు. 

అలాగే ఏపీలోని అనంతపురుం జిల్లా  హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  భార్య వసుంధరతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన బాలయ్య ఓటేశారు. కుడి చేతికి దట్టీతో తెలుపు రంగు దుస్తుల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చిన బాలకృష్ణ ఓపిగ్గా క్యూలైన్ లో నిలుచుకున్నారు.అనంతరం  తమ వంతు రాగానే పోలింగ్ ఆఫీసర్ కు ఐడీ కార్డును చూపించి ఓటేశారు. అనంతరం బయటకొచ్చి మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లకోసారి మాత్రమే ఓటేసే అవకాశం వస్తుందని బాలకృష్ణ తెలిపారు. హిందూపురంలో ఓటు హక్కును వినియోగించుకోవడం సొంత ఊర్లో వినియోగించుకున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. 

కాగా ఇప్పటికే హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, కుమారుడు రామ్ చరణ్, భార్య ఉపాసన, అల్లు అర్జున్, ఎన్టీఆర్, భార్య, తల్లీతో కలిసి వచ్చి క్యూలో నిలబడి ఓటు వేశారు. తెలంగాణలో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటుహక్కుని వినియోగించుకున్నారు.