మందుకొట్టి పోలీసులకు పట్టుబడిన ప్రిన్స్ 

  • Published By: chvmurthy ,Published On : November 26, 2019 / 07:38 AM IST
మందుకొట్టి పోలీసులకు పట్టుబడిన ప్రిన్స్ 

Updated On : November 26, 2019 / 7:38 AM IST

సినీ నటుడు, బిగ్ బాస్ ఫే ప్రిన్స్ సుశాంత్ మద్యం సేవించి వాహానం నడిపి పోలీసులకు చిక్కాడు. నవంబర్ 24 ఆదివారం రాత్రి హైదరాబాద్, బాచుపల్లి సమీపంలోని వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజి సమీపంలో పోలీసుల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రయివ్ లో ప్రిన్స్ పట్టుబడ్డాడు. ఞ

మోతాదుకు మించి మద్యం సేవించటంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.  ఈక్రమంలో మంగళవారం ప్రిన్స్ కూకట్ పల్లిలోని కోర్టుకు హాజరై జరిమానా రు.5వేలు చెల్లించారు. 
మరోసారి తప్పు చేయనని ప్రిన్స్ సుశాంత్ జడ్జి ముందు చెప్పినట్లు తెలిసింది. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఫస్ట్ టైమ్ పట్టుబడటంతో సుశాంత్‌కు జరిమానాతో సరిపెట్టారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ విష‌యంలో పోలీసులు ఎంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ప్ప‌టికి, మ‌నుషుల‌లో మార్పు రావ‌డం లేదు. తాగి డ్రైవ్ చేస్తూ ప్రాణాలు కోల్పోవ‌డ‌మే కాక రోడ్డుపై ప్ర‌యాణించేవారి జీవితాల‌తో ఆటలాడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రిన్స్ సుశాంత్..  నీకు నాకు డాష్ డాష్ , బస్ స్టాప్, రొమాన్స్, వేర్ ఈజ్ విద్యాబాలన్ వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు.