బీజేపీ ఎంపీని కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

  • Published By: vamsi ,Published On : September 12, 2019 / 10:50 AM IST
బీజేపీ ఎంపీని కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

Updated On : September 12, 2019 / 10:50 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన్న కేబినెట్ విస్తరణ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ ముఖ్య నేతలు ఆ పార్టీకి వ్యతిరేకంగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ తనకు ఇచ్చిన మాట తప్పారని నాయిని నరసింహ రెడ్డి, కేబినెట్‌లో మాదిగలకు చోటివ్వలేదని మరో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆవేదన వ్యక్తం చేయగా.. జోగు రామన్న వంటి వ్యక్తులు కాస్త అసంతృప్తికి లోనయ్యారు.

ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించారు. అయితే, లేటెస్ట్ గా మరో ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తికి గురయ్యారు.

టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రాగానే కేబినెట్‌లో మైనార్టీ కోటాలో కేబినేట్ లో చోటు దక్కుతుందని ఆశించిన నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ రెండో విడత కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో పార్టీకి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలిశారు షకీల్.

రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, జిల్లాలోని అనేక రాజకీయ విషయాలపై ఇద్దరి మధ్య లోతైన చర్చ జరిగింది. అంటూ ఈ విషయాన్ని ధర్మపురి అరవింద్‌ ఫేస్ డుక్ ద్వారా వెల్లడించారు. దీంతో షకీల్ బీజేపీ గూటికి చేర్చుకునే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.