పంతంగ్ అలర్ట్ : ప్రాణాలు తీస్తున్న ‘చైనా మాంజా’

  • Published By: veegamteam ,Published On : January 11, 2019 / 05:10 AM IST
పంతంగ్ అలర్ట్ : ప్రాణాలు తీస్తున్న ‘చైనా మాంజా’

హైదరాబాద్ : చైజా మాంజా జోరుతో ప్రాణాలు బేజారెత్తిపోతున్నాయి. చూసేందుకు చిన్నపాటి దారమే అయినా ప్రాణాలు తీయటంతో చాలా పదును గలదీ చైనా మాంజా. దీనిపై ప్రభుత్వ నిషేధం వున్నా అమ్మకాలు మాత్రం జోరుగా జరుగుతున్నాయి. 

ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా 
సంక్రాంతి పండగకు పది రోజుల  ముందు నుండే హైదరాబాద్ నగరంలో పతంగులు జోరు జోరుగా ఎగరేస్తుంటారు. గతంలో ఈ పతంగులను ఎగరేసేందుకు కాటన్‌ మాంజాను వాడేవారు. పంతంగుల పోటీ..మార్కెట్ లో కూడా పోటీ  పెరగడంతో ప్రస్తుతం మార్కెట్‌లో ప్రమాదకరమైన ‘చైనా మాంజా’ రాజ్యమేలుతోంది. రసాయనాలు పూసిన ఈ మాంజాతో మనుషులతో పాటు పక్షులకు కూడా ప్రాణాపాయం కలుగుతోంది. 

చైనా  మాంజాపై రాష్ట్ర ప్రభుత్వం 2017, జూలై 11న నిషేధం
చైనా  మాంజాపై రాష్ట్ర ప్రభుత్వం 2017, జూలై 11న నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా కూడా వుంటుంది. రెండేళ్ల క్రితం నిషేధ చట్టం చేసినా ఇప్పటికీ నగరంలోని  మార్కెట్‌లో చైనా మాంజా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.  

పంజేషా, ధూల్‌పేటతో జోరుగా చైనా మంజా విక్రయాలు
పంజేషా, ధూల్‌పేటతో పాటు తో నగరంలో పలు ప్రాంతాలలో చైనా మంజా విక్రయాలు రహస్యంగా..విచ్చలవిడిగా సాగిపోతున్నాయి. డబ్బులు ఎక్కువగా చెల్లిస్తే రహస్యంగా పేపర్‌లో చుట్టి చేతికిచ్చేస్తారు. చైనా మాంజా ముంబైతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి దిగుమతి అయ్యేది. రెండేళ్ల నుంచి ప్రభుత్వ నిషేధంతో దీన్ని దిగుమతికి వ్యాపారులు కొద్దిగా వెనక్కి తగ్గినా..సీక్రెట్ గా అమ్మేస్తున్నారు. చైనా మాంజా స్టిఫ్ గా..స్ట్రాంగా వుండటంతో ప్రాణాలకు ముప్పు వున్నా..ప్రభుత్వ నిషేధం వున్నా..దొరికితే భారీ జరిమానాలు వున్నా.. మార్కెట్ లో మంచి గిరాకీ వుండటం..లాభాలు ఎక్కువగా వుండటంతో సీక్రెట్ గా అమ్మేస్తున్నారు. ప్రజలు కూడా నైలాన్‌ దారంతోనే పతంగులు ఎగురవేయడానికి ఇష్టపడుతున్నారు.దీంతో  చైనా మాంజాపై నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని, పక్షుల ప్రాణాలను కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

పక్షులకు గాయాలు..మనుషులకు ప్రమాదాలు
పతంగుల పోటీల్లో ఎదుటివారి గాలిపటాన్ని నేలకూల్చడంలో (కైంచీ) చేయటంలో ఈ చైనా మాంజా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ ప్లాస్టిక్‌ దారానికి గాజుపొడి అద్ది తయారు చేయటంతో గాలిపటం ఎగురవేసే వారికి, పక్కనున్న వారి చేతులకూ గాయాలవటంతో పాటు చెట్లకు, కరెంట్ పోల్స్ లకు చిక్కుకోవటంతో చిక్కుకోవడంతో మాంజాకు తగిలే పక్షులు, జంతువులు కూడా మృత్యువాత పడుతున్నాయి.  అంతేకాదు..రోడ్లపై బైక్ లపై వెళ్లేవారికి గాల్లో వేలాడుతు వచ్చిన ఈ మాంజాతో గొంతుకలు కట్ అయిపోయిన సందర్భాలు కూడా చాలానే జరిగాయి. ఈ క్రమంలో మనుషుల ప్రాణాలకు కూడా ముప్పుగా ఈ చైనా మాంజా వుంది. 

ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడి కుమారుడగ ఇలాంటి ప్రమాదం జరగడంతో అతడు కోర్టు పిటీషన్ వేసిన ప్రమాదానికి కారణాలను కోర్టు సబ్మిట్ చేశాడు. ఈ పిటీషన్ పై విచారించిన కోర్టు చైనా మాంజా నిషేధించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గతంతో సంప్రదాయంగా తయారైన పంతంగుల దారం ఫిట్ గా పదునుగా వుండటంకోసం మాంజా దారానికి సాబుదానా అంటే సగ్గుబియ్యం, గంధకం, రంగులు వేసి మాంజాను తయారు చేసేవారు. ప్రస్తుతం ఈ చైనా మాంజా వినియోగంతో పక్షలు, జంతువులతో పాటు మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదంగా తయారయ్యింది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి చైనా మంజాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా వుంది.