బ్యాంకు ఖాతాలో రూ.1500, ఇంటికే రేషన్ బియ్యం.. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం యోచన

హైదరాబాద్ ప్రగతి భవన్ లో మంగళవారం(మార్చి 24,2020) సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరుగుతోంది. సుదీర్ఘంగా ఈ సమావేశం జరుగుతోంది. లాక్ డౌన్

  • Published By: veegamteam ,Published On : March 24, 2020 / 01:45 PM IST
బ్యాంకు ఖాతాలో రూ.1500, ఇంటికే రేషన్ బియ్యం.. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం యోచన

Updated On : March 24, 2020 / 1:45 PM IST

హైదరాబాద్ ప్రగతి భవన్ లో మంగళవారం(మార్చి 24,2020) సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరుగుతోంది. సుదీర్ఘంగా ఈ సమావేశం జరుగుతోంది. లాక్ డౌన్

హైదరాబాద్ ప్రగతి భవన్ లో మంగళవారం(మార్చి 24,2020) సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరుగుతోంది. సుదీర్ఘంగా ఈ సమావేశం జరుగుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యవసర సరకుల సరఫరాపై ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ అధికారులతో చర్చిస్తున్నారు. సరుకులు ప్రజలకు ఎలా అందించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. తెలరేషన్ కార్డుదారుల బ్యాంకు అకౌంట్ లో రూ.1500 వేయడం, ఇంటికే రేషన్ బియ్యం అందించడం, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ అమలు చేయడం వంటి యోచనలో ప్రభుత్వం ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో బ్లాక్ మార్కెట్, నిత్యవసర వస్తువుల ధరలు పెంచి అమ్మేవారిపై యాక్ట్ ప్రకారం కేసులు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు లాక్ డౌన్ పట్ల ప్రజల నిర్లక్ష్య వైఖరిపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.