ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష

ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.

  • Published By: veegamteam ,Published On : October 22, 2019 / 09:18 AM IST
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష

Updated On : October 22, 2019 / 9:18 AM IST

ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.

ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రత్యామ్నాయ  ఏర్పాట్లపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇవాళ సీఎం కేసీఆర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వాదన వినిపిస్తోంది. మరోవైపు తెలంగాణ సర్కార్ కు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ కాపీ పంపింది. కాసేపటి క్రితమే ప్రభుత్వానికి హైకోర్టు ఆర్డర్ కాపీ చేరింది. ప్రగతి భవన్ లో నిర్వహిస్తున్న సమావేశంలో హైకోర్టు ఆర్డర్ కాపీ, హైకోర్టుకు సమర్పించాల్సిన నివేదిక, ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తున్నారు.

ముఖ్యంగా ఆర్టీసీ సమ్మెపై మూడు రోజుల క్రితం హైకోర్టు స్పందించింది. దానికి సంబంధించి ఆర్డర్ కాపీ ప్రభుత్వానికి అందింది. ప్రధానంగా ఈ ఆర్డర్ కాపీపైనే ఈ సమావేశంలో చర్చలు జరుగబోతున్నాయి. ఈ ఆర్డర్ కాపీపై ఈనెల 28 న హైకోర్టుకు మరోసారి ప్రభుత్వం నివేదిక ఇవ్వాల్సివుంది. కాబట్టి దీనికి ఏ అంశాలను జోడించాలన్న దానిపై చర్చిస్తున్నారు. కోర్టు ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పాలి..దాంతోపాటు ఆర్టీసీ కార్మికులతోటి చర్చలు కొనసాగించాలని కోర్టు ఆదేశించిన క్రమంలో ఏ అంశాలపై కార్మికులతో చర్చలు మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. 

ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ఎదుట 26 డిమాండ్లు ఉంచారు. అందులో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ప్రధాన డిమాండ్ గా ఉంది. ఈ డిమాండ్ పట్ల ప్రభుత్వ సానుకూలంగా లేదు. ఇది సాధ్యం కాని అంశంగానే ప్రభుత్వం చూస్తోంది. ఈక్రమంలో చర్చలపై ప్రతిష్టంభన కొనసాగింది. మరోవైపు 18 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది.

ఒకవైపు సమ్మెకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అవన్ని రావాలంటే సమ్మె విరమిస్తే తప్ప సాధ్యం కాని పరిస్థితి వుంది. 
కాబట్టి ఒకవైపు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి…మరోవైపు ప్రజలు ఇబ్బంది కలుగకూడదన్న అంశంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై సమీక్ష జరుగుతోంది. సమీక్ష తర్వాత కార్మికులతో ప్రభుత్వం చర్చలు ప్రారంభిస్తుందా? ఒకవేళ ప్రారంభిస్తే ఎప్పటిలోగా ప్రారంభిస్తుందన్న అంశం పట్ల స్పష్టత వచ్చే అవకాశం ఉంది.