ఒక్క మున్సిపాలిటీ పోయినా.. మంత్రి పదవి ఊడుతుంది : సీఎం కేసీఆర్ సీరియస్ వార్నింగ్
సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మున్సిపాలిటీ ఓడినా మంత్రి పదవి పోతుందని హెచ్చరించారు.

సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మున్సిపాలిటీ ఓడినా మంత్రి పదవి పోతుందని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మున్సిపాలిటీ ఓడినా మంత్రి పదవి పోతుందని హెచ్చరించారు. శనివారం (జనవరి 4, 2020) హైదరాబాద్ లో నిర్వహించిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభ్యర్థిని ఫైనల్ చేశాక వెన్నుపోటు పొడిస్తే సహించేదిలేదన్నారు. పాత, కొత్త నాయకులు సమన్వయంతో ఉండాలని సూచించారు.
మున్సిపల్ ఎన్నికలపై కేడర్ కు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేయాలని తెలిపారు. సీఎం కేసీఆర్ వార్డుల వారీగా నివేదికలు తెప్పించుకున్నారు. సర్వేలన్నీ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్ధేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, కేడర్ తో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
నియోజకవర్గాల్లో నెలకొన్న గ్రూప్ పాలిటిక్స్ పై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. టికెట్ల పంపిణి విషయంలో రెబెల్స్ బుజ్జగించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య జరిగిన గొడవపై కేసీఆర్ ఆరా తీశారు. మల్లారెడ్డి, సుధీర్ రెడ్డితో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు.