కాంగ్రెస్ కు మరో షాక్ : కేటీఆర్ తో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిశారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిశారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ ను వీడనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిశారు. ప్రగతి భవన్ లో ఆయన భేటీ అయ్యారు. మార్చి 16 శనివారం సీఎం కేసీఆర్ ను సుధీర్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ఇవాళ ఉదయమే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్ లో చేరారు.