’పంచాయతీ’లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై ఆగ్రహ జ్వాలలు

తెలంగాణలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై వార్ మొదలైంది.

  • Published By: sreehari ,Published On : December 29, 2018 / 07:47 AM IST
’పంచాయతీ’లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై ఆగ్రహ జ్వాలలు

Updated On : December 29, 2018 / 7:47 AM IST

తెలంగాణలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై వార్ మొదలైంది.

హైదరాబాద్ : తెలంగాణలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై వార్ మొదలైంది. వెంటనే ఆ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రిజర్వేషన్ల అంశం కొలిక్కిరాకముందే షెడ్యూల్ విడుదల చేస్తే ఈసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాయి. 

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడంపై బీసీ సేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకోబోమంటున్నారు బీసీ సంఘాలు. 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారు కాకమందే షెడ్యూల్ విడుదల చేస్తే ఈసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాయి.  ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి బీసీ సంఘాలు పిలుపు ఇచ్చాయి.