ఇక హైదరాబాద్‌లోనే కరోనా టెస్టులు

  • Published By: veegamteam ,Published On : March 24, 2020 / 02:28 AM IST
ఇక హైదరాబాద్‌లోనే కరోనా టెస్టులు

Updated On : March 24, 2020 / 2:28 AM IST

ఇప్పటి వరకు కరోనా టెస్టులు చేయాలంటే వైద్యపరీక్షలు చేసి పాజిటివ్‌గా తేలితే.. ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం శాంపిల్స్ పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించేవారు. ఆ రిపోర్ట్స్ రావడానికి సమయం పట్టేది. రిపోర్ట్స్ వస్తే కానీ వారికి వైరస్ ఉందో? లేదో తెలిసేది కాదు. కానీ, ఈ రోజు (మార్చి 24, 2020)నుంచి మనకి అందుబాటులోనే హైదరాబాద్‌  హబ్సిగూడలోని CCMB (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయలాజీ)ని కరోనా టెస్టుల కోసం సిద్ధం చేశారు.

కరోనా టెస్టుల కోసం అత్యాధునికమైన 12 రియల్‌ టైమ్‌ PCRలను సిద్ధం చేసినట్టు, 20 మంది నిపుణులను నియమించినట్టు CCMB డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా చెప్పారు.  తెలిపారు. లైఫ్‌ సైన్సెస్ పరిశోధనల్లో అగ్రస్థానంలో ఉన్న CCMBని కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు వేదికగా వాడుకోవడానికి అవకాశమివ్వాలని ముఖ్యమంత్రి KCR  విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. 

కరోనా నిర్ధారణ పరీక్షలకు తాము సర్వ సన్నద్ధంగా ఉన్నామని రాకేశ్‌మిశ్రా చెప్పారు. ఈ రోజు నుంచి శాంపిల్స్ పంపితే తాము పరీక్షలను నిర్వహిస్తామని గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ డాక్టర్లకు సమాచారమిచ్చారు. రోజుకు 500కుపైగా శాంపిల్స్ పరిశీలించే సామర్థ్యం CCMB ఉందని రాకేశ్‌మిశ్రా తెలిపారు.

See Also | 50 దేశాల్లో 170 కోట్ల మంది హోం క్వారంటైన్