Dont Miss : పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి

తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం(మార్చి 10) పల్స్ పోలియో కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఏపీ వ్యాప్తంగా ఆదివారం

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 01:28 AM IST
Dont Miss : పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి

తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం(మార్చి 10) పల్స్ పోలియో కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఏపీ వ్యాప్తంగా ఆదివారం

తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం(మార్చి 10) పల్స్ పోలియో కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఏపీ వ్యాప్తంగా 51లక్షల 66వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అందుకోసం 37వేల 493 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. మరో 1,354 సంచార  కేంద్రాలను కూడా ఏర్పాటుచేశారు.

ఆశా వర్కర్లు, ఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్ష 49వేల 977మంది సిబ్బంది పల్స్‌ పోలియో కార్యక్రమాల్లో పాల్గొంటారు. అప్పుడే పుట్టిన వారి నుంచి ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులు పోలియో చుక్కలు వేయించుకోవచ్చని అధికారులు సూచించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలోపు వయస్సున్న 35లక్షల 12వేల 333మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఆయా విభాగాలకు అవగాహన కల్పించారు. ఇందుకోసం 52లక్షల 19వేల 180 వ్యాక్సినేషన్ డోస్‌లు రెడీ చేశారు. మహిళా శిశు సంక్షేమశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీ రాజ్, ఐకేపీ, డిఫెన్స్, నేవీ, ఆర్టీసీ శాఖల సమన్వయంతో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఆదివారం(మార్చి 10) పల్స్‌ పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు, ఆ తర్వాత 2 రోజులపాటు ఇంటింటికీ వెళ్లి వేసేందుకు వైద్యశాఖ ప్రణాళిక రూపొందించింది. ప్రయాణాల్లో ఉన్నవారి కోసం 787 మొబైల్ టీమ్స్ ద్వారా అన్నిబస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలో చుక్కల మందు వేయనున్నారు. పల్స్‌ పోలియో కార్యక్రమంలో 95వేల 513 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు వైద్యశాఖ తెలిపింది. పల్స్ పోలియో గురించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఆదివారం నేషనల్ ఇమ్యునైజేషన్ డే ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పోలియోను దేశం నుంచి సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. దేశవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల సంఖ్య 17 కోట్లుగా ఉంది. వారందరికి పల్స్ పోలియో చుక్కలు వేయనున్నారు. March 27, 2014లో భారత్ ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.