కోర్టు ధిక్కరణ.. పోలీస్ ఆఫీసర్లకు జైలు శిక్ష, జరిమానా

సొంత రిసార్టులోకి పోలీసులు చొరబడి రమ్మీ ఆడుతున్నారని ఆరోపిస్తూ వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జగపతిరావు పోలీసులపై కేసు పెట్టారు. ఎమ్మెల్యే వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పోలీసులకు షాక్ ఇచ్చింది. ముగ్గురు పోలీసులు అధికారులకు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
మాజీ ఎమ్మెల్యే జగపతిరావు రిసార్టులో ఎలాంటి అనుమతులు లేకుండా దాడులు జరిపారని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పలుమార్లు పోలీసులకు సూచనలిచ్చింది. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకపోవడంతో పోలీసుల అధికారులకు శిక్ష విధించింది.
కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి, ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐ శశిధర్ రెడ్డికి 6నెలల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించిన హైకోర్టు. శిక్షను తగ్గించుకోవాలంటే ఉన్నత న్యాయస్థానానికి వెళతారో.. పోలీసులు స్వచ్ఛందంగా శిక్ష అనుభవించేందుకు సిద్ధమవుతారో చూడాలి.