తాగిన మైకంలో రచ్చ చేసిన అమ్మాయిలు.. రోడ్డు మీదే బట్టలు విప్పించేశారు

ఫూటుగా మద్యం సేవించిన నలుగురు యువతులు చైతన్యపురి కనకదుర్గ వైన్స్ పరిసరాల్లో హల్‌చల్ చేశారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న నలుగురు యువతులు చైతన్యపురిలోని కనకదుర్గ వైన్స్ ఎదురుగా ఉన్నబస్‌స్టాప్‌లో తిష్ట వేశారు.
వైట్‌నర్ పీల్చుతూ మద్యం కొనేందుకు వచ్చిన వారితో, రోడ్డు వెంట వెళ్తున్నవారితోనూ అకారణంగా గొడవకు దిగారు. దాడులు చేస్తూ నానా హంగామా సృష్టించారు. తమ వద్ద యువతులు డబ్బులు కూడా లాక్కున్నారంటూ స్థానికులు ఆరోపణ. రాత్రి 9 గంటల సమయంలో ఓ యువకుడిపై దాడి చేసి, బస్‌స్టాప్‌లో పడుకుని ఉన్న మరో యువకుడి బట్టలు విప్పి రౌడీల్లాగా ప్రవర్తించారని అంటున్నారు.
బహిరంగ ప్రదేశంలో ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదంటూ స్థానికులు వాపోతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి మైకంలో తూగుతూ దాడులు చేసిన యువతులపై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.