డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు : ప్రభుత్వం కీలక నిర్ణయం
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. దీని గురించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. దీని గురించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమకు అందుతాయా అని వెయిట్ చేస్తున్నారు. దీని గురించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇళ్లను కేటాయిస్తారు. ఈ విషయాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 2020 మార్చి నాటికి 2 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సిద్ధం చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుందన్నారు. అందుకు అనుగుణంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ఈ పథకం కోసం హడ్కో నుంచి రూ.4 వేల కోట్లను సమీకరించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. డబుల్ బెడ్ రూమ్‌ల ఎంపికలో ఎంపీ, ఎమ్మెల్యేల ప్రమేయం ఉండదన్నారు. ఎలాంటి పైరవీలకు అవకాశం ఉండదని మంత్రి తేల్చి చెప్పారు. అర్హులైన వారికి మాత్రమే ఇళ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు.
సోమవారం(సెప్టెంబర్ 16,2019) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు, వాటి కేటాయింపులపై సభ్యులు ప్రశ్నలు వేశారు. దీనికి మంత్రి సమాధానం ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై అనుమానాలు, అపోహలు ఉన్నాయన్నారు. పేదలకు కేటాయించే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి జిల్లా కమిటీకి పంపిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తిరిగి ఆయా గ్రామాలకు నివేదికను పంపిస్తారన్నారు. గ్రామంలో 100 మంది లబ్ధిదారులను గుర్తించిన తర్వాత అక్కడ 50 మందికి కేటాయించాల్సి వస్తే లాటరీ ద్వారా ఎంపిక పూర్తి చేస్తామన్నారు. ప్రతి గ్రామసభలో కనీసం 50శాతం ఎస్సీలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తామన్నారు. పట్టణాల్లో సైతం 50శాతం ఎస్సీలకు ఇళ్లను కేటాయిస్తామన్నారు. హైదరాబాద్‌లో 12 శాతం ముస్లింలకు కేటాయిస్తామని మంత్రి చెప్పారు.
ఇప్పటికే 1.8 లక్షల ఇళ్ల నిర్మాణం స్టార్ట్ అయిందని మంత్రి అన్నారు. 96 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. 34వేల ఇళ్లు లబ్దిదారులకు ఇవ్వాల్సి ఉందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ప్రభుత్వం రూ.6వేల 972 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ప్రైవేట్ బిల్డర్ల కన్నా ఎక్కువ స్థాయిలో ఇలా ప్రభుత్వం ఇళ్లను నిర్మించడం ఓ రికార్డ్ అని మంత్రి అన్నారు.