పదవి రాలేదని బాధలేదు.. కార్యకర్తగా పని చేస్తా : హరీశ్

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 06:40 AM IST
పదవి రాలేదని బాధలేదు.. కార్యకర్తగా పని చేస్తా : హరీశ్

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గంలో చోటు దక్కలేదనే బాధ లేదన్నారు. ఎప్పుడూ పదవులు ఆశించలేదని స్పష్టం చేశారాయన. పార్టీలో క్రమ శిక్షణ గల కార్యకర్తగా ఉంటానని చెప్పుకొచ్చారాయన. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. తెలంగాణ సంక్షేమమే ముఖ్యం అని వెల్లడించారు హరీశ్.

మంత్రివర్గంలో చోటు దక్కకపోవటం ఇదే మొదటిసారి అన్న ప్రశ్నకు కూడా ఆయన స్పందించారు. పార్టీ అవసరాలకు అనుగుణంగా మంత్రి పదవులు ఉంటాయని.. ఎవరికి ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా వినియోగించుకుని పార్టీని బలపేతం చేయాలో కేసీఆర్ కు తెలుసన్నారు హరీశ్ రావు.

సోషల్ మీడియాకి వార్నింగ్ :
మంత్రివర్గంలో చోటు దక్కకపోవటంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, స్టోరీలపైనా స్పందించారు హరీశ్. నా పేరుతో ఎలాంటి సేనలు లేవని.. కొందరు కావాలనే క్రియేట్ చేసి మరీ తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారాయన.