ఆరోగ్య రంగం కేంద్రం చేతుల్లో ఉండకూడదు : కేటీఆర్

హైదరాబాద్ : ఆరోగ్యరంగం కేంద్రం చేతుల్లో ఉండటం సరికాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న బయో ఏషియా సదస్సు-2019 కు మంగళవారం హైజరైన కేటీఆర్ మాట్లాడుతూ….తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారని స్పష్టం చేశారు. దేశంలో ప్రజావైద్యం ఎంతో మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు. సదస్సులో భాగంగా ఇవాళ షేపింగ్ ఇండయాస్ రోల్ ఇన్ గ్లోబల్ హెల్త్ కేర్- ఏ పొలిటికల్ అండ్ ఎకనామికల్ పర్స్పెక్టివ్ అనే అంశంపై చర్చ జరిగింది.
అంతర్జాతీయ 16వ బయో ఏసియా సదస్సు సోమవారం నుంచి మూడురోజుల పాటు జరుగుతుంది. సదస్సుకు 50కిపైగా దేశాలనుంచి దాదాపు 1,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం కాఫీటేబుల్ కన్వర్షన్‌లో భాగంగా “షేపింగ్ ఇండియా రోల్ ఇన్ గ్లోబల్ హెల్త్‌కేర్ – ఏ పొలిటికల్ అండ్ ఎకానమిక్ ప్రాస్పెక్టివ్” అనే అంశంపై చర్చలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు, ప్రధానమంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ పాల్గొన్నారు. 2004 నుంచి ఇప్పటివరకు జరిగిన సదస్సుల్లో 250 ఎంవోయూలు కుదిరి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.సదస్సు బుధవారం కూడా కొనసాగుతుంది.