బీ అలర్ట్ : నేడు తీవ్ర వడగాల్పులు

తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మే 10వ తేదీ శుక్రవారం తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
మే 11వ తేదీ శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 40 కి.మీ నుంచి 50 కి.మీ)లతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్ ఒడిశా నుంచి రాయలసీమ వరకు కోస్తాంధ్ర మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది.
Also Read : TV9 రవి ప్రకాష్ చుట్టూ ఉచ్చు : విచారణకు హాజరవుతారా
తెలంగాణ రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఎండవేడికి, వడగాలులకు జనాలు విలవిలలాడుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఉదయం 8 నుంచే సూర్యూడు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇక మే 09వ తేదీ గురువారం నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం | ఉష్ణోగ్రత |
హైదరాబాద్ | 41.6 |
ఆదిలాబాద్ | 43.3 |
హన్మకొండ | 43.0 |
భద్రాచలం | 44.5 |
మెదక్ | 42.3 |
ఖమ్మం | 45.6 |
మహబూబ్ నగర్ | 43.6 |
రామగుండం | 43.6 |
నల్లగొండ | 45.0 |
నిజామాబాద్ | 43.5 |