Heavy rains in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. దోమలగూడ, గాంధీనగర్, జవహర్‌నగర్‌, కార్వాన్, లంగర్​హౌస్‌, జియాగూడ, శంషాబాద్‌, ఆరాంఘర్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పూర్‌, గండిపేట్, నార్సింగి, మియాపూర్, చందానగర్, చాంద్రాయణగుట్ట, బార్కస్‌ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్ ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి.

Heavy rains in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

Heavy rains in Hyderabad

Updated On : September 22, 2022 / 3:14 PM IST

Heavy rains in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. దోమలగూడ, గాంధీనగర్, జవహర్‌నగర్‌, కార్వాన్, లంగర్​హౌస్‌, జియాగూడ, శంషాబాద్‌, ఆరాంఘర్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పూర్‌, గండిపేట్, నార్సింగి, మియాపూర్, చందానగర్, చాంద్రాయణగుట్ట, బార్కస్‌ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్ ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి.

ఎర్రగడ్డ, సనత్ నగర్, ఎస్సార్ నగర్, యూసఫ్‌గూడ, మైత్రివనం, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లోనూ వాన పడింది. పలు ప్రాంతాల్లోని రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాన కారణంగా చాలా మంది వాహనదారులు నీళ్లు తమపై పడకుండా ఉండడానికి మెట్రో పిల్లర్ల కిందే ఉండిపోయారు. మరోవైపు, తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారలుు తెలిపారు.

Rahul Gandhi On Congress President: ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికపై తొలిసారి స్పందించిన రాహుల్.. కీలక వ్యాఖ్యలు