కరోనా వ్యాప్తి నిరోధానికి చర్యలు చేపట్టాలి : ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
తెలంగాణలో కరోనా ప్రభావంపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది.

తెలంగాణలో కరోనా ప్రభావంపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది.
తెలంగాణలో కరోనా ప్రభావంపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది. మురికివాడలు, పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కరోనాను ఎదుర్కొనే ప్రణాళికను రేపు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. రేపటి నుంచి హైకోర్టుకు వచ్చే వారందరికీ మాస్కులు ఇవ్వాలని ఆదేశించారు. కక్షిదారులు కోర్టులకు రావొద్దని చెప్పాలంటూ న్యాయవాదులు సూచించారు. విచారణ ఖైదీలను జైలు సిబ్బంది హాజరుపర్చలేకపోతే మెజిస్ట్రేట్ శిక్షించవద్దని హైకోర్టు తెలిపింది.
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా కలకం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరో కరోనా అనుమానితుడు వచ్చాడు. బ్రిటీష్ ఎయిర్ వేస్ నుంచి వచ్చిన ప్రయాణికుడికి కరోనా లక్షణాలు ఉండటంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు హైదరాబాద్ ఐటీ సెక్టార్ లో కరోనా కలకలం నెలకొంది. మైండ్ స్పైస్ లోని ఓ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చాయి. రెండు వారాల క్రితం ఇటలీ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి కరోనా లక్షణాలు ఉండటంతో కార్యాలయాన్ని యాజమాన్యం మూసివేసింది. ఇంటి నుంచే పనిచేయాలంటూ ఉద్యోగులకు ఈ మెయిల్ చేశారు. మైండ్ స్పేస్ లోని ఇతర కార్యాలయాలను సిబ్బంది ఖాళీ చేయిస్తోంది. మరోవైపు ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు.
కరోనా వైరస్ కేసు నేపథ్యంలో గాంధీ ఆస్పత్రికి అనుమానితుల తాకిడి పెరుగుతోంది. నిన్న 47 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 45 మందికి నెగెటివ్ అని తేలిందని ఆస్పత్రి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేశారు. మరో ఇద్దరిపై అనుమానం ఉందని, వారి రక్త నమూనాల పరీక్షలను పుణె పంపామని, ఆ ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. వీరి టెస్టుల రిజల్స్ట్ రేపు వచ్చే అవకాశం ఉంది.