ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ఆదేశించలేము : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ఆదేశించలేమంది. సమ్మె లీగల్, ఇల్లీగల్ అని చెప్పే అధికారం లేబర్‌ కోర్టుకు మాత్రమే ఉందని స్పష్టం

  • Published By: veegamteam ,Published On : November 18, 2019 / 10:42 AM IST
ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ఆదేశించలేము : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Updated On : November 18, 2019 / 10:42 AM IST

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ఆదేశించలేమంది. సమ్మె లీగల్, ఇల్లీగల్ అని చెప్పే అధికారం లేబర్‌ కోర్టుకు మాత్రమే ఉందని స్పష్టం

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ఆదేశించలేమంది. సమ్మె లీగలా, ఇల్లీగలా అని చెప్పే అధికారం లేబర్‌ కోర్టుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్టీసీ సమ్మె సమస్యను పరిష్కరించాలని కార్మికశాఖ కమిషనర్ ను ఆదేశించిన కోర్టు.. 2 వారాల్లోగా పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించింది. ప్రభుత్వంతో చర్చలకు కమిటీని వేయాలని ఆర్టీసీ జేఏసీ లాయర్ మరోసారి హైకోర్టును కోరగా.. కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని కోర్టు తెలిపింది. ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా కమిటీ వేయాలన్న ఆర్టీసీ జేఏసీ న్యాయవాది హైకోర్టును కోరారు.

ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టుకి కొన్ని పరిమితులు ఉన్నాయని, పరిధి దాటి ముందుకు వెళ్లలేము అని వ్యాఖ్యానించింది. సమ్మెపై ఇటు కార్మికులకు కానీ అటు ప్రభుత్వానికి కానీ…ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము అని స్పష్టం చేసింది. కాగా, 2 వారాల్లోగా సమస్యని పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది.

అంతకు ముందు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. పారిశ్రామిక వివాదాల చట్టం, ప్రొహిబిషన్ ఆఫ్ స్ట్రైక్ యాక్ట్ ప్రకారం సమ్మె చట్ట విరుద్ధమని కోర్టుకు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా సమ్మెకు వెళ్లారన్న ప్రభుత్వ న్యాయవాది.. సెక్షన్ 24 ప్రకారం కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధంగా ప్రకటించాని హైకోర్టును కోరారు.

సోమవారం(నవంబర్ 18,2019) ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధం అని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు తాము పరిష్కరించలేము అని స్పష్టం చేసింది. కార్పొరేషన్ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేము అని కోర్టుకి తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్ పక్కన పెట్టినా.. మళ్లీ ఆ డిమాండ్ తో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

యూనియన్ల నేతలు తమ స్వార్థంతో ఆర్టీసీని నస్టాల్లోకి నెడుతున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రతిపక్షాలతో చేతులు కలిపారని, పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పింది. సమ్మెను ఇల్లీగల్ అని ప్రకటించాలని కోర్టుని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు.

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కార్మికులతో చర్చలు జరపలేము అని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రూట్ల ప్రైవేటీకరణపై అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వాదనలను అడిషనల్ ఏజీ రాంచందర్ రావు వినిపించారు. సమ్మె చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. సమ్మె ముందు కార్మికులు నోటీసులు కూడా ఇవ్వలేదని కోర్టుకి చెప్పారు. నోటీసు ఇచ్చిన తర్వాత కనీసం 6 వారాల పాటు ఆర్టీసీ నిర్ణయం కోసం కార్మిక సంఘాలు చూడాలన్నారు. కార్మికులు చట్ట ప్రకారం నడుచుకోలేదని కోర్టుకి చెప్పారు.