ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : అక్టోబర్ 19 వరకు విద్యాసంస్థలకు సెలవులు 

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె  ప్రభావం విద్యాసంస్థల సెలవులపై పడింది. ఈ సమ్మె ఇంకా కొనసాగుతున్న కారణంగా దసరా సెలవులను పొడిగించాలని టీ.సర్కార్ నిర్ణయం తీసుకుంది. 

  • Published By: veegamteam ,Published On : October 12, 2019 / 11:01 AM IST
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : అక్టోబర్ 19 వరకు విద్యాసంస్థలకు సెలవులు 

Updated On : October 12, 2019 / 11:01 AM IST

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె  ప్రభావం విద్యాసంస్థల సెలవులపై పడింది. ఈ సమ్మె ఇంకా కొనసాగుతున్న కారణంగా దసరా సెలవులను పొడిగించాలని టీ.సర్కార్ నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె  ప్రభావం విద్యాసంస్థల సెలవులపై పడింది. ఈ సమ్మె ఇంకా కొనసాగుతున్న కారణంగా దసరా సెలవులను పొడిగించాలని టీ.సర్కార్ నిర్ణయం తీసుకుంది. సమ్మె కారణంగా విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా అక్టోబర్ 19వ తదీ వరకు విద్యాసంస్థలకు సెలవులను పొడిగించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అప్పటిలోగా పూర్తిస్థాయిలో బస్సులు సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగకుండా మరిన్ని ప్రైవేట్‌ బస్సుల కోసం నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆదేశించారు.

దసరా సెలవులు అక్టోబర్ 13 వ తేదీతో ముగియనున్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 14వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కావాల్సివుంది. సమ్మె కారణంగా బస్సులు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరుగకపోడంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా విద్యాసంస్థలకు దసరా సెలవులు పొడిగించాలని నిర్ణయించారు.

ఈ సారి ఎప్పుడూ లేని విధంగా 16 రోజులు సెలవులు వచ్చాయి. ఒక పక్క ఆర్టీసీ కార్మికులు సమ్మె, మరోపక్క పండుగకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యే వారికి బస్సుల కొరత ఉండటంతో ప్రభుత్వం సెలవులను పొడిగించింది. అక్టోబర్ 5 వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. వారం రోజులుగా సమ్మె కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.