BHELలో 16 రోజులుగా వెలుగుతున్న స్ట్రీట్ లైట్స్

హైదరాబాద్ మహానగరంలో స్ట్రీట్ లైట్ల విషయంలో విమర్శలు కొనసాగుతునే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అస్సలు వీధిలైట్లు వెలగనే వెలగవు. కొన్ని ప్రాంతాల్లో పట్టపగలు కూడా వెలుగుతునే ఉంటాయి. అధికారులు వెలగనివాటి గురించి పట్టించుకోరు..నిరంతరంగా వెలుగుతున్నవాటి గురించీ పట్టించుకోరు. అధికారుల నిర్లక్ష్యానికి ఇవి సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. నగరంలోనీ బీహెచ్ఈఎల్ కాలనీలో స్ట్రీట్ లైట్స్ గత 16 రోజుల నుంచీ రాత్రీ పగలు వెలుగుతునే ఉన్నాయి. ఇది గమనించిన అనుమోద్ థామస్ అనే స్థానికుడు మంగళవారం (ఆగస్టు 27)న థామస్ ట్విట్టర్ ద్వారా అధికారులకు సమాచారం అందించాడు.
అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలపై భారం పడుతోదంటు ట్విట్లర్ ద్వారా వెల్లడించాడు. విద్యుత్ బిల్లులు కట్టేవారిపై రూ .3 లక్షలు భారం పడుతోందని తెలిపారు.విద్యుత్ తో బల్బులు వెలగాలంటే దానికి విద్యుత్ ను ఉత్పత్తి చేయటానికి 23 లక్షల లీటర్ల నీరు బీహెచ్ఈఎల్ ద్వారా వృధా అవుతోందని థామస్ పేర్కొన్నాడు.
ఇలా వృథా అయ్యే 23 లక్షల లీటర్ల నీరు రోజుకు 17,000 మంది ప్రజల అవసరాలను తీరుస్తుందో కూడా ట్విట్టల్ థామస్ వివరించారు. స్ట్రీట్ లైట్లను పగలూ రాత్రీ తేడా లేకుండా 24 గంటలు వెలిగటంతో భారీ స్థాయిలో విద్యుత్ దుర్వినియోగం అవుతోందంటు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం విద్యుత్, నీరు, డబ్బును ఎలా వృధా చేస్తున్నారో ట్విట్టర్ లో థామస్ ఎత్తిచూపారు. పగలు కూడా స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్న విషయాన్ని తాను ఆగస్టు 11 న అధికారులకు సమాచారం అందించినా..ఇప్పటి వరకూ అంటే గత 16 రోజుల నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదనీ అనుమోద్ మంగళవారం ట్వీట్టర్ ద్వారి వెల్లడించారు. మరి ఇప్పటికైనా అధికారులు మేలుకుని స్ట్రీట్ లైట్లను సక్రమంగా వినియోగిస్తారా..లేదా వారి సహజమైన నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తారో వేచి చూడాలి.