హైదరాబాద్ యూనివర్శిటీ అమ్మాయికి రూ.43లక్షల ఉద్యోగం

  • Published By: vamsi ,Published On : February 15, 2020 / 03:20 AM IST
హైదరాబాద్ యూనివర్శిటీ అమ్మాయికి రూ.43లక్షల ఉద్యోగం

Updated On : February 15, 2020 / 3:20 AM IST

అడోబ్ సిస్టమ్స్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) విద్యార్థిని నందిని సోనికి భారీ ప్యాకేజ్‌తో ఉద్యోగం దక్కింది. అమెరికన్ మల్టీనేషనల్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సంస్థ నిర్వహించిన ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో యువతి రూ.43 లక్షల వార్షిక వేతనం లభించే ఉద్యోగానికి ఎంపికైంది. హెచ్‌సీయూలోని ప్లేస్‌మెంట్‌ గైడెన్స్‌ అండ్‌ అడ్వైజరీ బ్యూరో సమన్వయంతో నిర్వహించిన ప్లేస్‌మెంట్‌‌లో విద్యార్ధిని ఈ ఉద్యోగానికి ఎంపికైంది.

స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో ఎంసీఏ చదువుతున్న నందిని సోని అడోబ్‌ సిస్టమ్స్‌ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. హెచ్‌సీయూ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక ప్యాకేజీ అందుకున్న విద్యార్థినిగా నందిని సోనీ నిలిచారు. నందిని తన పాఠశాలను విద్యను మహారాష్ట్రలోని బోయిసర్‌ అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌లో పూర్తి చేశారు. అహ్మదాబాద్‌లోని సెయింట్‌ జేవీయర్స్‌ కళాశాలలో బీసీఏ చదివారు. ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో 200 మందిపైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు హెచ్‌సీయూ ప్లేస్‌మెంట్‌ గైడెన్స్‌ అండ్‌ అడ్వైజరీ బ్యూరో చైర్మన్‌ రాజీవ్‌ వాంకర్‌ వెల్లడించారు.

ఎంతో మంది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో పార్టిసిపేట్ చేయగా వారిలో 200 మందిపైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని  తెలిపారు. అందులో అందరికంటే ఎక్కువ ప్యాకేజీ గల ఉద్యోగం సోని నందిని సాధించిందని తెలిపారు. స్మార్ట్‌ ఇండియా హాకథాన్‌– 2019లో తన బృందంతో కలిసి విజేతగా నిలిచినట్టు వెల్లడించారు. అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం రావడం సంతోషంగా ఉందన్నారు. 

Read Here>>వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!