సామూహిక అత్యాచారం కేసులో నలుగురికి 20 ఏళ్లు జైలుశిక్ష

  • Published By: nagamani ,Published On : December 8, 2020 / 09:25 AM IST
సామూహిక అత్యాచారం కేసులో నలుగురికి  20 ఏళ్లు జైలుశిక్ష

Updated On : December 8, 2020 / 9:34 AM IST

Hyderabad : Four gang rape accused 20 years prison : ఓ మహిళపై జరిగిన అత్యాచారం కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు దోషులకు 20 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తు సంచలన తీర్పునిచ్చింది. 14నెలల్లో కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ ప్రారంభించేలా చేసిన రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ కృషి చేశారు. ఈక్రమంలో మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన నలుగురు దోషులకు 20 సంవ్సరాల కఠిన జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 20ఏళ్ల జైలుతో పాటు రూ.2వేల జరిమానా కూడా విధించింది.



వివరాల్లోకి వెళ్లితే.. ఒడిశా రాష్ర్టానికి చెందిన రాహుల్‌ మాజీ, మనోజ్‌ సామ్రాట్‌, దుర్గా సామ్రాట్‌, దయనిధి మాజీ మహేశ్వరం పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఇటుక బట్టీలో పని చేస్తున్నారు. అదే ఇటుక బట్టీలో పనిచేస్తున్న.. ఒడిశాకు చెందిన ఓ మహిళ..2019 అగస్టు 16న రాత్రి సమయంలో పనిమీద బైటకు రాగా..ఆమెను గమనించిన నలుగురు యువకులు ఆమెపై కన్నేశారు. బలవంతంగా ఆమెను ఎత్తుకుపోయారు. అనంతరం నిర్మానుష్యంగా ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి తెగబడ్డారు.



ఒళ్లంతా గాయాలతో ప్రాణాలతో బైటపడిన సదరు బాధితురాలు మహేశ్వరం పోలీసులకు తన బాధ వెళ్లబోసుకుంది. పొట్టకూటికోసం వచ్చిన నాపై నలుగురు యువకులు అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదు రోజుల్లో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులు దుర్గా సామ్రాట్, మనోజ్, రాహుల్ మాజీ, దయానిథి మాజీలు ఒడిశా రాష్ర్టానికి చెందినవారు కావడంతో.. జైలు నుంచి విడుదలైతే..తిరిగి వారిని పట్టుకోవడం కష్టమని భావించిన సీపీ మహేశ్‌ భగవత్‌ వారిపై పీడీయాక్ట్‌ విధించారు.



అనంతరం కేసును త్వరగా విచారించారు. తగిన ఆధారాలు సేకరించారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారంగా తగిన సాక్ష్యాధారాలను సేకరించారు. అనంతరం ఈ కేసు విచారణను ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారణ సమయంలో సాక్ష్యాధారాలను నిరూపించడంతో సోమవారం (డిసెంబర్ 7,2020)రంగారెడ్డి జిల్లా 17వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.మారుతీదేవి నిందితులు దుర్గా సామ్రాట్, మనోజ్, రాహుల్ మాజీ, దయానిథి మాజీలకు 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానాను విధించారు.



నిందితులకు జైలు శిక్ష పడేలా విచారణను సాగించిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బుచ్చిరెడ్డి, న్యాయ సలహాదారుడు చంద్రశేఖర్‌, అప్పటి మహేశ్వరం ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న నాయక్‌, కోర్టు కానిస్టేబుల్‌ ఆఫీసర్‌ గణేశ్‌, కానిస్టేబుల్‌ గిరిధర్‌, సీతారాం రెడ్డిలను సీపీ మహేశ్‌ భగవత్‌ అభినందించారు.