బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో 120మంది కార్మికులు

Hyderabad : major fire accident in bollaram Chemical Factory : హైదరాబాద్ బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వింధ్యా ఆర్గానిక్ కంపెనీలో రియాక్టర్ పేలటంతో పెద్ద శబ్దంతో కంపెనీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ పేలుడు ప్రమాదంలో 20మందికిపైగా కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
మంటల్లో 120మందికి పైగా కార్మికులు ఫ్యాక్టరీలో చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కంపెనీలో లోపల మరికొంతమంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదం సంభవించిందనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తేవటానికి యత్నిస్తున్నారు.పొగ దట్టంగా వ్యాపించటంతోసహాయక చర్యలకు అంతరాయం కలుగుతున్నట్లుగా తెలుస్తోంది.
అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు కూడా సహాయంగా నిలిచారు. కాగా పొగలు దట్టంగా అలుముకోవటంతో లోపల చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఎలా ఉందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అయితే సకాలంలో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
https://youtu.be/HbhXc0EAJow