తెలుగు నేర్చుకోవాలనుకుంటున్నారా..అయితే అప్లై చేసుకోండి

హైదరాబాద్ మహానగరం. సర్వమతాల కలయిక. పలు సంస్కృతీ సంప్రదాయాల మేలు కలయిక భాగ్యనగరం. పలు రాష్ట్రాల నుంచి ఎంతోమంది హైదరాబాద్ నగరానికి ఉపాధి కోసం వస్తుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలే కాక పలు ఉపాధి రంగాలను వెతుక్కుంటు ఇక్కడికి వచ్చి స్థిరపడినవారు లక్షలాదిమంది ఉన్నారు. తన వద్దకు వచ్చినవారందరీనీ అక్కున చేర్చుకుంటుందీ భాగ్యనగరం.
400ల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ లో చాలామంది స్థానిక భాషతో ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారికి తేలికగా తెలుగును నేర్పేందుకు తెలుగు అకాడమీ ముందుకొచ్చింది. తెలుగు పరిచయ కోర్సును నిర్వహిస్తోంది. తెలుగు నేర్చుకోవాలనుకునే ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 16 తేదీలోపు తెలుగు అకాడమీని సంప్రదించి అప్లై చేసుకోవాలని తెలుగు అకాడమీ అధికారులు తెలిపారు. కోర్సు పూర్తయ్యే సరికి తెలుగులో రాయడం, చదవడం, మాట్లాడేలా తీర్చిదిద్దుతారు.
ఏజీ కార్యాలయం, ఈసీఐఎల్, ఐఐసీటీ, ఎన్‌జీఆర్‌ఐ, ఎన్‌ఐఎన్, నిఫ్ట్, నైపర్, సర్ధార్ పటేల్ పోలీస్ అకాడమీలు సహా ఐటీ కంపెనీ ఉద్యోగులు. తెలుగు భాష రాని వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
తెలుగు పరిచయ కోర్సు వివరాలు ఇలా ఉన్నాయి..
దరఖాస్తులకు చివరి తేదీ : సెప్టెంబర్ 16, 2019
బోధన కాల వ్యవధి : 48 పనిరోజులు (వర్కింగ్‌డేస్)
బోధన సమయం : సాయంత్రం 5 :30 గంటల
నుంచి రాత్రి 7 : 30 గంటల వరకు (రెండు గంటల పాటు)
ప్రవేశానికి కనీస విద్యార్హత : 10వ తరగతి
తరగతులు ప్రారంభమయ్యే తేదీ : సెప్టెంబర్ 18, 2019
తరగతులు నిర్వహించు స్థలం : తెలుగు అకాడమీ, హిమా యత్‌నగర్.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 040 -23226041