పూలకుండీల చోరీ : మొక్కలంటే ఇష్టం ఉంటే కొనుక్కోవాలి..ఇలా కొట్టేయకూడదమ్మా

  • Published By: nagamani ,Published On : November 11, 2020 / 05:04 PM IST
పూలకుండీల చోరీ : మొక్కలంటే ఇష్టం ఉంటే కొనుక్కోవాలి..ఇలా కొట్టేయకూడదమ్మా

Updated On : November 11, 2020 / 5:16 PM IST

Hyderabad woman caught on cc camera stealing plants : ‘‘పూలమొక్కలంటే అంత ఇష్టం ఉంటే కొనుక్కోవాలి గానీ ఇలా ఎవరి ఇంటిముందు పూలకుండీలుంటే వాటిని ఎత్తుకెళ్లిపోకూడదమ్మా’’.. అని చెప్పాలి ఈమెకు. ఎందుకంటే అందరూ పడుకున్నాక ఆమె బైటకొస్తుంది.



ఎవరింటిముందు పూలకుండీలు ఉన్నాయో ముందే చూసుకుని రాత్రి అయ్యాక వచ్చి చక్కగా ఆ పూలకుండీలన్నీ తస్కరించుకుని పట్టుకుపోతోంది. ఇది తెలియక చాలామంది వారి ఇళ్లముందున్న పూలకుండీలు కనిపించకుండా పోవటంతో ఆశ్చర్యపోతున్నారు. రాత్రి ఉండాలి..తెల్లారేసరికి ఏమైపోయాయా? అనుకుంటున్నారు.



ఎవరన్నా..కార్లు, బైకులు, సైకిళ్లు, బంగారం, డబ్బులు చోరీచేస్తారు. కానీ దొంగతనాలకు పాల్పడే పలువురి దొంగల్ని ఇప్పటివరకు మనం చూశాం. కానీ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్కంపేటలో ఓ మహిళ వెరైటీగా ఇళ్ల ముందు అందం కోసం పెట్టుకున్న పూలకుండీలను ఎత్తుకెళ్లిపోతోంది.



అందరూ గాఢ నిద్రలో నిద్రపోయే సమయంలో తెల్లవారుజామున 3 నుంచి మూడున్నర గంటల మధ్యలో ఓ మహిళ కూడా సంచులు తెచ్చుకుని ఇంటి ముందు పెట్టుకున్న పూల కుండీలను చక్కగా సంచిలో పెట్టుకుని పట్టుకుపోతోంది. పైగా ఆమె తనకు నచ్చిన కుండీల్ని సెలక్ట్ చేసుకుని మరీ పట్టుకెళ్లిపోతోంది.



పూల కుండీల చోరీ ఆ ప్రాంతంలోని సిసి ఫుటేజీలో రికార్డు కావడంతో ఇంటి యజమానులు సైతం ఆశ్చర్యపోయారు. విషయం పోలీసులకు తెలిపారు. దీంతో సీపీ ఫుటేజ్ రికార్డ్ ఆధారంగా పూల కుండీలను దొంగలించిన మహిళా కోసం అన్వేషణలో పడ్డారు. పాపం ఆమెకు అక్కడ సీసీ టీవీలు ఉన్నాయనే సంగతి తెలీదేమో..లేదా సీసీ టీవీలో తను చేసిన పని తెలుస్తుందని తెలీదేమో….