కాబోయే సీఎం నేను కాదు

తెలంగాణకు కాబోయే సీఎం ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో నెక్ట్స్ సీఎం అంశం చర్చకు దారితీసింది. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం

  • Published By: veegamteam ,Published On : January 1, 2020 / 09:23 AM IST
కాబోయే సీఎం నేను కాదు

Updated On : January 1, 2020 / 9:23 AM IST

తెలంగాణకు కాబోయే సీఎం ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో నెక్ట్స్ సీఎం అంశం చర్చకు దారితీసింది. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం

కేసీఆర్ తర్వాత తెలంగాణకు కాబోయే సీఎం ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో నెక్ట్స్ సీఎం అంశం చర్చకు దారితీసింది. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం కేటీఆరే అంటూ ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది టీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవయ్యాయి. కొందరు అంగీకారం తెలిపితే మరికొందరు హరీష్ రావు పేరుని తెరపైకి తెచ్చారు. హరీష్ రావుకి ఏం తక్కువ.. ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని వాదించారు.

తాజాగా ఈ అంశంపై స్వయంగా మంత్రి కేటీఆర్ స్పందించారు. మీడియాతో చిట్ చాట్ చేశారు. నేను కాబోయే సీఎం అన్నది వాస్తవం కాదన్నారు. తాను సీఎంగా కొనసాగుతానని సీఎం కేసీర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. అయినా.. కేటీఆర్ సీఎం అని మళ్లీ ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు. కాబోయే సీఎం నేను కాదు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. కేటీఆర్ అలా ఎందుకు అన్నారు అని డిస్కస్ చేసుకుంటున్నారు. పార్టీలో విభేదాలు రాకుండా కేటీఆర్ అలా చెప్పి ఉంటారని విశ్లేషిస్తున్నారు. 

వాస్తవంగా టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. కొన్ని వర్గాలు కేటీఆర్ కు మద్దతుగా ఉంటే.. కొన్ని వర్గాలు హరీష్ రావుకి సపోర్ట్ గా ఉంటున్నాయి. హరీష్ రావు సీనియర్ రాజకీయ నాయకుడు, అపారమైన రాజకీయ అనుభవం, పరిపాలన దక్షత ఉన్నాయని చెబుతున్నారు. ముందు నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారని, పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేశారని గుర్తు చేస్తున్నారు. దీంతో కాబోయే సీఎం ఎవరు అనే అంశం టీఆర్ఎస్ లో వివాదానికి దారితీసే చాన్స్ కనిపించింది. వెంటనే స్పందించిన కేటీఆర్.. వివాదం మరింత ముదరకుండా ఫుల్ స్టాప్ పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత యువనేత కేటీఆర్ తదుపరి సీఎం అవుతారని కొన్ని రోజుల క్రితం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశమంతా కేసీఆర్ వైపు చూస్తోంటే.. రాష్ట్రంలోని యువత కేటీఆర్ వైపు చూస్తోందని, విజన్ ఉన్న నేత కేటీఆర్ అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం కావడం సహజమైన విషయమేనని అన్నారు.

Also Read : సెలూన్ లో బుక్ చదివితే 30% డిస్కౌంట్