తెలంగాణ లో ఐఏఎస్, ఐపీఎస్ లకు పదోన్నతులు

  • Published By: chvmurthy ,Published On : April 23, 2019 / 12:02 PM IST
తెలంగాణ లో ఐఏఎస్, ఐపీఎస్ లకు పదోన్నతులు

Updated On : April 23, 2019 / 12:02 PM IST

హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎతున్న సివిల్ సర్వీస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ లకు పదోన్నతులు కల్పిస్తూ 15 జీవోలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో తెలంగాణా ప్రభుత్వం వీరికి పదోన్నతులు ఇచ్చింది. వీరిలో ముగ్గురికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురికి కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి ఇచ్చారు. ఒకరికి ముఖ్య కార్యదర్శి, 4 గురికి కార్యదర్శి, 6 గురికి అదనపు కార్యదర్శులుగా పదోన్నతులు, 5 గురు ఐఏఎస్ లకు సంయుక్త కార్యదర్శి, మరో 4 గురికి డెప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. 
 
అలాగే 23 మంది ఐపీఎస్ ల పదోన్నతులు కల్పించారు. వీరిలో 5 గురు ఐపీఎస్ లకు అదనపు డీజీలుగా పదోన్నతి, 4 గురు ఐపీఎస్ లకు ఐజి, 7 గురు ఐపీఎస్ లకు డీఐజీ లుగా, 6 గురు ఐపీఎస్ లకు సీనియర్ స్కేల్ అధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరొక అధికారికి ఐజి గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.