అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి : మంద కృష్ణ డిమాండ్

  • Published By: chvmurthy ,Published On : May 3, 2019 / 01:12 PM IST
అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి : మంద కృష్ణ డిమాండ్

Updated On : May 3, 2019 / 1:12 PM IST

హైదరాబాద్ : రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పర్మిషన్ లేకపోయినా అది కూల్చకుండా, అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు కూల్చారో సమాధానం చెప్పాలని ఎమ్మార్పీస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కూల్చిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కూల్చిన చోటనే అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కేసీఆర్ కు దళితులపై ఉన్న ప్రేమ ఏపాటిదో ఇప్పటికే తెలిసిందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో ఎందుకు పాల్గొనడం లేదో సమాధానం చెప్పాలని అన్నారు. 

రాష్ట్రంలో చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ప్రభుత్వం తరుఫున ఎవరూ పరామర్శించ లేదని, చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన అన్నారు. తప్పు చేసినా.. గ్లోబరినా పై చర్యలు తీసుకోటానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన విద్యార్థులకు నివాళి అర్పించడానికి వెళ్లిన వారిని అరెస్టు చేయడం దారుణమని, ఉద్యమాలను అణచి  వేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.