IPL ఫైనల్ మ్యాచ్ : స్టేడియంలోకి ఈ వస్తువులకు నో ఎంట్రీ

IPL ఫైనల్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో మే 12వ తేదీ ఆదివారం సాయంత్రం జరుగనుంది. మీరు మ్యాచ్‌కు వెళుతున్నారా.. అయితే ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే వీటిని స్టేడియంలోకి అనుమతించరు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ విడుదల చేసిన లిస్ట్ ప్రకారం ఇలా ఉన్నాయి ఆ వస్తువులు.
– టూ వీలర్స్ పై వచ్చే వారు హెల్మెట్ లను స్టేడియంలోకి అనుమతించరు. బండి దగ్గరే వదిలేయాలి.
– కెమెరా, ల్యాప్ ట్యాప్, పవర్ బ్యాంక్, బ్యాటరీస్ లను అనుమతించరు.
– సిగరేట్లు, సిగరెట్ ప్యాకెట్లు, లైటర్, అగ్గిపెట్టె, క్రాకర్స్ ను అనుమతించరు.
– బైనాక్యులర్, లైటింగ్ పెన్స్, పెద్ద బ్యాగ్స్, ఫెర్‌ఫ్యూమ్స్ స్టేడియంలోకి తీసుకెళ్లకూడదు
– ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్, బ్యానర్లు, కర్రలను అనుమతించరు.
– కేవలం సెల్‌ఫోన్లు, ఇయర్ ఫోన్స్ మాత్రమే మీ వెంట అనుమతిస్తారు.
ముంబై, చెన్నై నుంచి చాలా మంది వస్తున్నారని.. ముందు జాగ్రత్తలో భాగంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అనుమతి తీసుకునే స్టేడియంలో ఫైర్, క్రాకర్స్ కాలుస్తారని ప్రకటించారు. పోలీస్ శాఖ విధివిధానాలకు అనుగుణంగానే అందరూ నడుచుకోవాలని సూచించారు. గేట్ల దగ్గర గొడవలకు దిగొద్దని సూచించారు. అనుమతి లేని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావొద్దని ప్రేక్షకులకు సూచించారు.