హైదరాబాద్‌లో ఇస్రో సైంటిస్ట్ హత్య

  • Published By: vamsi ,Published On : October 1, 2019 / 02:31 PM IST
హైదరాబాద్‌లో ఇస్రో సైంటిస్ట్ హత్య

Updated On : October 1, 2019 / 2:31 PM IST

హైదరాబాద్‌లోని ఎస్ఆర్‌ నగర్‌ పరిధిలో ఇస్రో శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఎస్ఆర్‌ నగర్‌ పరిధి బి.కె.గుడాలో అన్నపూర్ణ అపార్ట్‌మెంట్ 2వ అంతస్తులో ఇస్రో శాస్త్రవేత్త సురేష్‌(55)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. 

విషయం తెలుసుకున్న పశ్చిమ మండలం ఇంఛార్జి డీసీపీ సుమతి, ఏసీపీ తిరుపతన్న సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. శాస్త్రవేత్త సురేష్‌ నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ అండర్‌ ఇస్రోలో పనిచేస్తున్నాడు. మృతుడు కేరళవాసిగా గుర్తించారు.

గత 30 ఏళ్లుగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు సురేష్. సురేష్ కు భార్య, కుమారుడు ఉన్నారు. భార్య చెన్నైలో ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. చెన్నైలో ఉన్న భార్య ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటి తలుపులు తెరిచి చూడగా సురేష్ విగతజీవిగా పడి ఉన్నారు.