జయరామ్ కేసు : ఐదుగురు పోలీసుల విచారణ

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 05:50 AM IST
జయరామ్ కేసు : ఐదుగురు పోలీసుల విచారణ

హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులు ఈరోజు పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. సస్పెన్స్ థిల్లర్ గా కొనసాగుతున్న ఈ కేసుతో సంబంధముందన్న ఐదుగురు పోలీస్ అధికారులను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు (ఫిబ్రవరి 20) విచారించనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి జయరామ్ ను హత్య చేసిన అనంతరం పోలీసులు సహాయం తీసుకున్నాడని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.  ఈ క్రమంలో బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో  ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్, రాయదుర్గం సీఐ రాంబాబు  లతో పాటు మరో ఇద్దరు అధికారులను విచారించనున్నారు. 
 

జయరామ్ హత్య తరువాత పలువురి పోలీస్ అధికారుల సలహా మేరకు జయరామ్  హత్యను యాక్సిడెంట్ గా చిత్రీరించేందుకు సదరు అధికారులే రాకేశ్ రెడ్డికి సలహా ఇచ్చినట్లుగా విచారణలో వెల్లడైంది. వీరితో పాటు ఈ కేసుతో సంబంధమున్న నటుడు సూర్యను కూడా మరోసారి విచారించనున్నారు.  ఫిబ్రవరి 19న రాకేశ్ రెడ్డిని కేసు రీ కన్ స్ట్రక్ట్ కోసం నందిగామ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. రాకేశ్ రెడ్డికి టీడీపీకి చెందిన ఓ నేతతో ఉన్న పరిచయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో రెండు రోజుల్లో సదరు నేతను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.