ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్: రేపటి నుంచి జాయిన్ అవ్వండి- కేసిఆర్

తెలంగాణ రాష్ట్రంలో 50రోజులకు పైగా స్ట్రైక్ చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కేసిఆర్. తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న ఉద్యోగులు అందరూ రేపు ఉదయం ఉద్యోగాల్లో చేరాలని పిలుపునిచ్చారు కేసిఆర్. ఈ మేరకు వెంటనే లిఖితపూర్వక ఉత్తర్వులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
రేపు ఉదయాన్నే జాయిన్ అవ్వాలని కార్మికులకు చెప్పారు. మా బిడ్డలు మీరు అని ముందే చెప్పినం. మీ దగ్గర డూప్లికేట్ మాటలు ఉండవు అని, కక్ష పూరితంగా వ్యవహరించే అలవాట్లు మాకు లేవు అని అన్నారు కేసిఆర్.
సమ్మె వల్ల ఎంతోమంది జీవితాలు, జీతాలు పొయ్యాయి. మేము పేదల పొట్ట కొట్టలేదు. ప్రతి కార్మికుడుని కూడా మేం కడుపులో పెట్టుకుంటాం. చనిపోయినవారి కుటుంబాలలో కూడా ఒక్కరికి ఉద్యోగం ఇస్తాం. రేపు ప్రభుత్వం నుంచి రూ.100కోట్లు ఇస్తామని అన్నారు. అలాగే ఛార్జీల భారం పెంచుతాం.. కిలోమీటరుకు 20పైసలు పెంచుతాం అని ఈ విషయీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు కేసిఆర్.