కేటీఆర్ రిక్వెస్ట్ : అభిమాన సంఘాలు వద్దు

  • Published By: veegamteam ,Published On : January 6, 2019 / 03:30 PM IST
కేటీఆర్ రిక్వెస్ట్ : అభిమాన సంఘాలు వద్దు

Updated On : January 6, 2019 / 3:30 PM IST

తన పేరు మీద ఏర్పాటు చేస్తున్న వివిధ సంఘాలు, యువసేనలు, అభిమాన సంఘాలకు తన వైపు నుంచి ఎలాంటి మద్దతు లేదని… టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పష్టం చేశారు.  కేటీఆర్ యువసేన, కేటీఆర్ సేవాదళ్,  కేటీఆర్ అభిమాన సంఘం వంటి పేర్లతో పలువురు సంఘాలను ఏర్పాటు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని… ఇలాంటి వాటిని తాను ఏమాత్రం ఆమోదించంబోనని ఆయన అన్నారు. దీంతో పాటు ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ కేటీఆర్ యువసేన, కేటీయార్ అభిమాన సంఘం వంటి వివిధ పేర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు సైతం వాటిని వెంటనే ఆపేయాలని కోరారు. వారందరిని టీఆర్ఎస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాల్సిందిగా కోరారు.