ఆమె చిరునవ్వు చాలా విలువైనది: ట్విట్టర్‌లో కేటిఆర్

  • Published By: vamsi ,Published On : April 20, 2019 / 01:45 AM IST
ఆమె చిరునవ్వు చాలా విలువైనది: ట్విట్టర్‌లో కేటిఆర్

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ట్విట్టర్‌లో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయపరమైన కామెంట్లను ట్విట్టర్ వేదికగా చేస్తుంటారు. అలాగే అవసరం అనేవారికి సాయం చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ట్విట్టర్‌లో కేటిఆర్ భావోద్వేగంతో ఒక ట్వీట్‌ను పెట్టారు. ఇటీవల తాను సాయం చేసిన చిన్నారి ఊపిరి పోసింది.

కాగా పాపకు మరో జన్మ ఇచ్చారంటూ కేటీఆర్‌కు వాట్సప్ ద్వారా కృతజ్ఞతలు ఒక వ్యక్తి తెలియజేశారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న పాప ఫొటోను ఒకరు కేటిఆర్‌కు పంపారు. పాప పిరిస్థితిపై ఆనందం వ్యక్తం చేసిన కేటీఆర్.. పాప త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మెసేజ్ చేశారు.

కాగా ఫోటో పంపిన వ్యక్తి పర్మిషన్‌తో కేటిఆర్ ఆ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.  ‘నేను దృష్టిసారించాల్సిన, హాజరుకావాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. కానీ ఈ చిన్నారి నవ్వు ఎంతో విలువైనది. ఆమె కోలుకుంటోందన్న మెసేజ్ నా ప్రజాజీవితాన్ని విలువైనదిగా చేసింది’ అంటూ ట్వీట్‌ చేశారు. గుండెజబ్బుతో బాధపడుతున్న బాలిక ఆపరేషన్‌కు కేటీఆర్‌ సాయం చేశారు. ఆ బిడ్డ ప్రస్తుతం కోలుకుంటుంది.