నగర వాసులకు సూచన : పీ వీ ఎక్స్‌ప్రెస్..వన్ వే

దశాబ్ధం నుంచి హైదరాబాదీలకు సేవలు అందిస్తోన్న PV Narsimha rao Express కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనుంది. అక్కడక్కడా డ్యామేజ్ అయిన రోడ్‌ను మరమ్మతులు చేయడానికి HMDA రెడీ అవుతోంది. ఈ సమయంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి కనుక ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఎక్స్‌ప్రెస్ వే పై ఏప్రిల్ 22 నుంచి ఆంక్షలు విధించనున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని… దానికి ప్రజల సహకారం కావాలని అధికారులు కోరుతున్నారు.
హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు ప్రయాణించడానికి ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేయలని ఈ రోడ్డుకు శ్రీకారం చుట్టింది. 5వందల 40 కోట్లతో ఈ భారీ ఫ్లై ఓవర్‌ను నిర్మించడానికి మొదట అనుకున్నా.. పనులు ఆలస్యం కావడంతో ఆ ఖర్చు 6వందల కోట్లకు పెరిగింది. 2009 అక్టోబర్‌లో ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి నిరవధికంగా నగరవాసుకుల తన సేవలు అందిస్తుంది ఎక్స్‌ప్రెస్ వే.
కొన్ని సంవత్సరాల నుండి ఫ్లై ఓవర్ పై ఎలాంటి రిపేర్లు చేయకపోవడంతో రోడ్డు ఎక్కువగా దెబ్బతింది. దాంతో దానిని పూర్తి స్థాయిలో రిన్నోవేట్ చేయడానికి ప్లాన్ చేసిన హెచ్ఎండిఏ. 11.6కిలో మీటర్ల పొడవున్న నాలుగు లేన్ల రోడ్డులో బ్లాక్ టాప్ చేయడానికి సిద్ధం అయ్యింది. అందుకోసం 12 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిన అధికారులు ఈ రోడ్డులోని ట్రాఫిక్‌ను 3 నెలల పాటు మళ్ళించనున్నారు.
వాహనదారులకు ఇబ్బంది కలుగుకుండా సిటీ నుండి ఎయిర్ పోర్డుకు వెళ్లే రోడ్డులో వన్ వే ట్రాఫిక్ అనుమతించనున్నారు. డివైడర్‌కు ఒక వైపు రోడ్డు క్లియర్‌గా ఉంచి మరో వైపు రోడ్డు అభివృద్ది చేస్తాంటున్నారు అధికారులు. అంతే కాకుండా ఎక్స్ ప్రెస్ వే క్రింది భాగంలో పూర్తిగా కలరింగ్ చేయడానికి మరో 9 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇక ఎయిర్ పోర్టు నుండి వచ్చే వాహనాలు మాత్రం నాలుగు నెలల పాటు క్రింది నుండి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా :
– చాంద్రాయణ గుట్ట, జూపార్కు రోడ్డు, శివరాంపల్లి నుండి మెహిదీపట్నం నుండి వచ్చే వాహన దారులు పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే కింది నుండి శివరాంపల్లి, పీడీపీ ఎక్స్ రోడ్డు, ఉప్పర్ పల్లి, హైదర్ గూడ, అత్తాపూర్, రేతిబౌలి నుండి మెహిదీపట్నానికి చేరుకోవాల్సి ఉంటుంది.
– శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే కింది నుండి ఆరాంఘర్, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్ రోడ్డు, ఉప్పర్ పల్లి, హైదర్ గూడ, అత్తాపూర్, రేతిబౌలి, మెహదీనపట్నం మీదుగా రావాల్సి ఉంటుంది.