బాంబుల్లా పేలుతున్నాయి : జీడిమెట్ల కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

  • Published By: madhu ,Published On : September 21, 2019 / 02:29 AM IST
బాంబుల్లా పేలుతున్నాయి : జీడిమెట్ల కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

Updated On : September 21, 2019 / 2:29 AM IST

నగరంలోని పారిశ్రామిక వాడల్లో అగ్ని ప్రమాదాలు కామన్ అయిపోతున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్య్యం వల్లో..షార్ట్ సర్క్యూట్ వల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో సమీప ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా జీడిమెట్లలో కెమికల్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 

కుత్బుల్లాపూర్‌లోని జీడిమెట్ల కార్తికేయ కామాక్షి కెమికల్ కంపెనీలో సెప్టెంబర్ 21వ తేదీ శనివారం ఉదయం ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో ఉన్న కెమికల్ డ్రమ్ములు పేలిపోతున్నాయి. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. కొద్ది నిమిషాల్లోనే మంటలు కంపెనీ చుట్టూ వ్యాపించాయి. వెంటనే గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. 

మంటలతో పాటు పొగ కమ్ముకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిందా అనేది తెలియరాలేదు. కానీ..భారీగానే ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా. ఉదయం పూట మంటలు చెలరేగడం, మంటలు, పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే..ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియరాలేదు. 
Read More : చేవెళ్లలో రోడ్డు ప్రమాదం : టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి గాయాలు