MAKAR SANKRANTI: ‘మకర సంక్రాంతి’ పండుగ ఒకటే.. దేశం మొత్తం వేర్వేరు పేర్లతో ‘పొంగల్’
దేశ ప్రజలకు సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ ఒకటే... అయినప్పటికీ, ఈ పండుగను దేశం మొత్తం ఒకే పేరుతో కాకుండా వేర్వేరు పేర్లతో చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, పెద్ద పండుగ, పతంగుల పండుగగా వేడుకలు చేసుకుంటారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఏయే పేర్లతో మకర సంక్రాంతిని జరుపుకుంటారో చూద్దామా?

MAKAR SANKRANTI
MAKAR SANKRANTI: సంక్రాంతి పండుగ వచ్చేసింది. దేశం మొత్తం పండుగ చేసుకునేందుకు సిద్ధమైంది. దేశ ప్రజలకు సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ ఒకటే… అయినప్పటికీ, ఈ పండుగను దేశం మొత్తం ఒకే పేరుతో కాకుండా వేర్వేరు పేర్లతో చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతి, పెద్ద పండుగగా వేడుకలు చేసుకుంటారు. అల్లుళ్లను ఇళ్లకు పిలవడం, పిండి వంటలు చేసుకోవడం, గాటిపటాలు ఎగరేయడం వంటి సంబరాలు తెలంగాణ, ఏపీల్లో జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఏయే పేర్లతో మకర సంక్రాంతిని జరుపుకుంటారో చూద్దామా?
కశ్మీర్‌లో, జమ్మూలోని పలు ప్రాంతాల్లో మకర సంక్రాంతిని శిశుర్ సంక్రాత్‌గా జరుపుకుంటారు. జమ్మూలోని పలు ప్రాంతాల్లో మాఘీ సంగ్రాండ్ గానూ పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్ లో మకర సంక్రాంతిని మాఘ సాజీగా జరుపుకుంటారు. మట్టిపాత్రల్లో అన్నం వండుకుంటారు. గాటిపటాలు ఎగరవేస్తారు. పంజాబ్ లో ఈ పండుగను లొహ్రీగా జరుపుకుంటారు. పంజాబ్ రైతులు ఈ పండుగను నూతన సంవత్సరంగా భావిస్తారు.
ఉత్తరాఖండ్ లో సంక్రాంతిని ఘుఘుటీ, కాలే కౌవగా జరుపుకుంటారు. ఢిల్లీ, హరియాణాల్లో సక్రాత్ గా ఈ పండుగను చేసుకుంటారు. అలాగే, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో సుకరత్, సక్రాత్ గా ఈ పండుగను జరుపుకుంటారు. సూర్యుడికి పూజలు చేస్తారు. ఉత్తరప్రదేశ్ లో మకర సంక్రాంతిని కిడిచీ పర్వ్ గా జరుపుకుంటారు. ప్రయాగ్ రాజ్ లో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరిస్తారు. గుజరాత్ లో మకర సంక్రాంతిని జనవరి 14న ఉత్తరాయణంగా జరుపుకుంటారు.
మహారాష్ట్రంలో మాఘి సంక్రాంతి, హాల్దీ కుంకుంగా ఈ పండుగ చేసుకుంటారు. ఒడిశాలో మకర చౌలాగా జరుపుకుంటారు. ప్రజలు చక్కెర, కొబ్బరి, అరటిపండు వంటి వాటితో ప్రత్యేకంగా తీపి అన్నం చేసుకుంటారు. కర్ణాటకలో సుగ్గి హబ్బాగా, గోవాలో మాఘి సంక్రాంత్, హాల్దీ కుంకుంగా, కేరళలో మకరవిలక్కుగా, తమిళనాడులో పొంగల్ గా జరుపుకుంటారు. శ్రీలంకలోనూ పొంగల్ గా ఈ పండుగ చేసుకుంటారు.
Amazon Lay Off Employees : ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్.. భారత్ లో 1000 మంది