50శాతం డిస్కౌంట్ : రూ.75లకే మెట్రో స్మార్ట్‌కార్డ్

హైదరాబాద్ : ప్రయాణీకులకు మెట్రో ట్రైన్ సంస్థ ఉగాదికానుక ఇస్తోంది. ప్రయాణికులను పెంచుకునేందుకు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ స్మార్ట్ కార్డును రూ. 75 లకు తగ్గించింది. మూడు నెలల వరకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది సంస్థ. ఇప్పటి వరకూ ఈ కార్డు కోసం రూ.150 లు చెల్లించాల్సి వచ్చేది. ఇక నుంచి 75 రూపాయలకే అందుబాటులో ఉండనుంది. ప్రయాణీకుల సంఖ్యను పెంచేందుకు స్మార్ట్ కార్డు ధర 50శాతం తగ్గించినట్లు ప్రకటించింది మెట్రో.
ఇందులో రూ.50 వరకు ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. నగదు అయిపోగానే కనీసం రూ.50, ఎక్కుగా (గరిష్ఠంగా) రూ.3 వేల వరకు రీఛార్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. రూ.150 చెల్లించాల్సి స్మార్డ్ కార్డ్ రూ.75లు చెల్లించి తీసుకోవచ్చు. ఈ మొత్తంలో రూ.20 తిరిగి చెల్లించనక్కరలేకుండానే ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. ఈ ఉగాది ఆఫర్ ను వినియోగించుకుందుకు ప్రయాణీకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 6 లక్షలపైగా కార్డులను మెట్రో విక్రయించింది. స్మార్ట్ కార్డ్ రేటు తగ్గించడంతో ఈ కార్డుల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని మెట్రో అంచనా వేస్తోంది.