మనసున్నోడు : మరుగుజ్జును పెళ్లి చేసుకున్న యువకుడు

హైదరాబాద్ : వివాహం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని ఘట్టం. జీవితంలో తమకు సరైన ఈడు,జోడు కోసం పరితపిస్తుంటారు. కానీ సిద్దిపేటకు చెందిన విద్యాసాగర్ (25) అనే యువకుడు ఓ మరుగుజ్జు యువతిని వివాహం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. చిన్నతనంలో అమ్మనాన్నలను కోల్పోయిన విద్యాసాగర్ అనాధగా పెరిగాడు. డిగ్రీ వరకు చదివిన అతను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సికింద్రాబాద్ మహంకాళి ప్రాంతానికి చెందిన రవళి (22) అనే 3 అడుగుల 2 అంగుళాల ఎత్తున యువతి కుటుంబం నుంచి సంబంధం వచ్చింది. రవళి ఇంజనీరింగ్ పైనల్ ఇయర్ చదువుతోంది.
ఎవరూ లేని తనకు ఓ కుటుంబం తోడుగా ఉంటుందని, ఆమెకు జీవితాన్ని ఇచ్చినట్లవుతుందని భావించి పెళ్లి చేసుకోటానికి అంగీకరించాడు. ఎవరూ లేని అనాధ అయిన విద్యాసాగర్ కూడా ఇల్లరికానికి ఒప్పుకున్నాడు. సికింద్రాబాద్‌లో జరిగిన ఈ ఆదర్శ జంట వివాహ వేడుకకు హాజరైన వారంతా నవ జంటను అభినందించారు.
Read Also:గుండెల్ని పిండేసే ఘటన : అమర జవానుకు భార్య చివరి ముద్దు
Read Also:సీరియల్ నటి ఘనకార్యం : దోమల్ని చంపబోయి.. ఇల్లు కాల్చేసుకుంది