పరిసరాల పరిశుభ్రత : ఇంటిని క్లీన్ చేసిన మంత్రి కేటీఆర్

  • Published By: madhu ,Published On : September 10, 2019 / 09:44 AM IST
పరిసరాల పరిశుభ్రత : ఇంటిని క్లీన్ చేసిన మంత్రి కేటీఆర్

Updated On : September 10, 2019 / 9:44 AM IST

నగరంలో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఎంతో మంది డెంగీ, మలేరియా ఇతర వ్యాధులతో బాధ పడుతున్నారు. ప్రధాన ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో GHMC అప్రమత్తమైంది. పరిశుభ్రతపై చర్యలు తీసుకొంటోంది. ప్రతి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని GHMC సమీక్షలో మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

చెప్పడం కాదు..చేసి చూపించారాయన. పరిసరాల పరిశుభ్రత తన ఇంటి నుంచే ఆయన మొదలు పెట్టారు. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం ప్రగతి భవన్ లోని ఆయన నివాసాన్ని శుభ్రం చేశారు. ఇంట్లోని వస్తువులను క్లీన్ చేశారు. చెట్ల కుండీల్లో ఉన్న నీటిని పారపోశారు. స్వయంగా క్లీన్ చేసి..దోమల మందును కొట్టారు. మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 
Read More : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం : 50 వేల పోలీసుల నిఘా 
హైదరాబాద్ పారిశుధ్యంపై ప్రత్యేక శద్ధ చూపెట్టాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఉదయం నుంచే విధుల్లో పాల్గొని పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. డెంగీ ప్రబలిన ప్రాంతాల్లో మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర అధికారులు పర్యటించారు. పారిశుధ్య నిర్వాహణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు మేయర్.