ఎన్నికల హీట్: మోడీ, రాహుల్ తెలంగాణలోనే!

ఓవైపు సమ్మర్.. హీట్ మరోవైపు ఎన్నికల హీట్.. సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ నాయకుల ప్రచారంను ఉదృతం చేశారు. సరిగ్గా 10రోజులు మాత్రమే ఎన్నికలకు ఉండడంతో ఢిల్లీలోని అగ్ర నాయకులు సైతం తెలంగాణకు వచ్చి ప్రచార వేగం పెంచేస్తున్నారు. తొలిదశ లోక్ సభ ఎన్నికలకు ప్రచారం చేసుకోవడానికి 9 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఢిల్లీ నుంచి అగ్రనేతలు దక్షిణాదికి క్యూ కడుతున్నారు.
ఇప్పటికే మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ(2019 ఏప్రిల్ 1) సాయంత్రం 5గంటలకు ఎల్బీ స్టేడియంలోని సభలో పాల్గొంటారు. అంతకుముందుగా మోడీ రాజమండ్రిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా తెలంగాణ గడ్డపై ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లోక్ సభ ఎన్నికల ప్రచారాలలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, నాగర్ కర్నూల్, మల్కాజ్‌గిరి అభ్యర్థులు, ముఖ్యనేతలతో చర్చిస్తున్న ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గంలోని రామగుండంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.